తదుపరి వార్తా కథనం

AP Mega DSC: రోజువారీ కూలీ డీఎస్సీలో 75వ ర్యాంకు
వ్రాసిన వారు
Sirish Praharaju
Sep 16, 2025
11:15 am
ఈ వార్తాకథనం ఏంటి
ఏడేళ్లుగా రోజువారీ కూలీ పనులు చేసి జీవనం సాగించారు,అయినా పట్టు విడవకుండా చదివి మెగా డీఎస్సీలో విజయం సాధించారు. చాట్ల రత్నరాజుది డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, పి.గన్నవరం మండలం, నాగుల్లంక శివారు, కాట్రగడ్డ వద్ద నివసిస్తున్నారు. 2014లో బి.ఇ.డిగ్రీ పూర్తి చేసుకున్నా,2014,2018లో డీఎస్సీ పరీక్షల్లో విఫలమయ్యారు. ఆ తర్వాత కుటుంబ అవసరాలను నెరవేర్చే విధంగా ఏ పని దొరికితే ఆ పనికి వెళ్తున్నారు. ఆయన భార్య కూడా కూలీ పనుల్లో సహకరిస్తూ,ముగ్గురు పిల్లల్నిపెంచుతున్నారు. ఇంత కష్టకాలంలోనూ,రత్నరాజు తన చదువును వదలలేదు.ఆ కృషికి ఫలితంగా,మెగా డీఎస్సీ పరీక్షలో 75వ స్థానం సాధించారు. అంతేకాక,స్కూల్ అసిస్టెంట్ (సోషల్)పోస్టును కూడా పొందారు.డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసిన సీఎం చంద్రబాబుకు రత్నరాజు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.