LOADING...
Dandari festivals: ఆదివాసి గూడెంలలో దండారి ఉత్సవాలు ప్రారంభం
ఆదివాసి గూడెంలలో దండారి ఉత్సవాలు ప్రారంభం

Dandari festivals: ఆదివాసి గూడెంలలో దండారి ఉత్సవాలు ప్రారంభం

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 14, 2025
05:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఏజెన్సీ ప్రాంతం అయిన ఆదిలాబాద్ జిల్లాలోని నార్నూర్, గాదిగూడ మండలాల ఆదివాసి గూడెంలలో దండారి ఉత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. నార్నూర్ మండలంలోని ఎంపల్లి గోండు గూడ గ్రామంలో ఆదివాసులు భోగి పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఏత్మాసూర్ పేంకు సాంప్రదాయపూర్వకంగా పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో గుస్సాడి టోపీలు, డోల్, పెప్రే, తుడుం, కాలికోమ్, సూర్ణ, డప్పులు, కొలాటాలకు సంబంధించిన అలంకరణ సామగ్రిలకు పూజలు చేశారు. గుస్సాడి వేషధారణ కూడా చేస్తున్నారు. గ్రామ పెద్దల ప్రకారం, దండారి ఉత్సవాలను కోలబోడి వరకు భక్తి, నియమనిష్టతో నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో పేందోర్ అమృత్ రావు పటేల్, సంతోష్, చిత్రు, రాము, ఆనందరావు, జలపతి, జగన్నాథ్ తదితరులు పాల్గొన్నారు.