NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం కుమార్తె గౌను కుట్టిన టైలర్ తో కిడ్నాప్ చేయించి.. మాజీ ఐపీఎస్ పుస్తకంలో దావూద్ స్టోరీ 
    తదుపరి వార్తా కథనం
    Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం కుమార్తె గౌను కుట్టిన టైలర్ తో కిడ్నాప్ చేయించి.. మాజీ ఐపీఎస్ పుస్తకంలో దావూద్ స్టోరీ 
    దావూద్ ఇబ్రహీం కుమార్తె గౌను కుట్టిన టైలర్ తో కిడ్నాప్ చేయించి..

    Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం కుమార్తె గౌను కుట్టిన టైలర్ తో కిడ్నాప్ చేయించి.. మాజీ ఐపీఎస్ పుస్తకంలో దావూద్ స్టోరీ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Aug 19, 2024
    11:34 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి డాక్టర్‌ శైలేంద్ర శ్రీవాస్తవ రాసిన 'షాకిల్‌ది స్టార్మ్‌' పుస్తకంలో షాకింగ్ విషయాలను వెల్లడించారు.

    దావూద్ ఇబ్రహీం కుమార్తె పెళ్లి గౌనుకు, 2005లో ఇండోర్ వ్యాపారవేత్త కుమారుడి కిడ్నాప్‌కు సంబంధం ఉందని పుస్తకంలో బహిర్గతం చేశారు.

    దావూద్ కుమార్తె వివాహానికి సంబంధించిన గౌను శివపురి జిల్లాకు చెందిన టైలర్ ఇస్మాయిల్ ఖాన్ తయారు చేశాడు.

    2005లో దావూద్ కుమార్తె మహరుఖ్ వివాహం మక్కాలో జరిగింది. పెళ్లయిన నెల రోజులకే ఇండోర్ నుంచి సిమెంట్ వ్యాపారి కుమారుడు నితీష్ నగోరి కిడ్నాప్ కు గురయ్యాడు.

    దావూద్ కుమార్తె కోసం గౌను సిద్ధం చేసిన ఇస్మాయిల్ ఈ కేసులో ప్రధాన నిందితుడు.

    వివరాలు 

    ఇస్మాయిల్ ఇంకా పరారీలో ఉన్నాడు 

    కిడ్నాప్ ఘటన తర్వాత ఇస్మాయిల్ ఖాన్ ఇంకా పరారీలో ఉన్నాడు. ఇస్మాయిల్‌కు దావూద్ అనుచరుడు అఫ్తాబ్ ఆలమ్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

    ఈ ఇద్దరిలో ఎవరినీ పట్టుకోలేకపోయారు. ఈ విషయం చాలా కాలం పాటు అణచివేయబడింది, కానీ రిటైర్డ్ ఐపిఎస్ అధికారి డాక్టర్ శైలేంద్ర శ్రీవాస్తవ పుస్తక ప్రచురణ తర్వాత మరోసారి చర్చలోకి వచ్చింది.

    వివరాలు 

    రూ.4 కోట్లు డిమాండ్‌ చేసిన కిడ్నాపర్లు 

    ఆగస్ట్ 17, 2005న నితీష్ కిడ్నాప్ అయ్యారు. కిడ్నాపర్లు అతడిని విడుదల చేయాలంటే రూ.4 కోట్లు డిమాండ్‌ చేశారు.

    నితీష్‌ని కిడ్నాప్ చేయడంలో ఇస్మాయిల్‌కు సహాయం చేసినందుకు నితీష్ స్నేహితుడు ధృవ్, సహచరుడు గౌరవ్‌ను సెప్టెంబర్ 2005లో అరెస్టు చేశారు.

    పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇస్మాయిల్‌ను ధృవ్‌ సూత్రధారిగా పేర్కొన్నాడు. ఈ విచారణలో మహరుఖ్ పెళ్లి దుస్తులను ఇస్మాయిల్ కుట్టినట్లు పోలీసులకు తెలిసింది.

    వివరాలు 

    ఇస్మాయిల్‌కు దావూద్ అనుచరులతో సంబంధాలు ఉన్నాయి 

    అఫ్తాబ్‌తో ఇస్మాయిల్‌కు ఉన్న సంబంధాల గురించి కూడా పోలీసులకు తెలిసింది. 1997లో అఫ్తాబ్ ముంబై పారిపోయాడు .

    ఇండోర్ నుండి వ్యాపారవేత్త కుమారుడు కిడ్నాప్ అయినప్పుడు, అతను గల్ఫ్ దేశంలో పనిచేస్తున్నట్లు సమాచారం.

    కిడ్నాప్‌లో పాల్గొన్నందుకు ఇస్మాయిల్‌కు దుబాయ్‌లో ఉద్యోగం, కమీషన్, దంపతులకు కోటి రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారని పోలీసులు చెబుతున్నారు.

    2010లో ఇండోర్ కోర్టు నిందితులు అమ్జాద్ ఖాన్, ఇద్రిస్ ఖాన్,మనీష్‌లకు జీవిత ఖైదు విధించింది.

    ఈ కేసులో ధృవ్, గౌరవ్,మరికొందరిని నిర్దోషులుగా విడుదల చేసింది.

    అమ్జాద్,ఇద్రిస్ 2020-21లో బెయిల్ పొందారు. ఇస్మాయిల్ ఇంకా పట్టుకోలేదు. మరో ఇద్దరు నిందితులు రాంధావా, ఇబ్రహీం కూడా పట్టుబడలేదు.

    వారిపై వారెంట్లు జారీ చేయడంతోపాటు అఫ్తాబ్‌పై వారెంట్ కాపీని ఇంటర్‌పోల్‌కు పంపారు.

    వివరాలు 

    ఇస్మాయిల్ ముంబైకి పారిపోయాడు 

    మాజీ ఐపీఎస్ శైలేంద్ర శ్రీవాస్తవ మాట్లాడుతూ.."ఘటన తర్వాత ఇస్మాయిల్ ముంబైకి పారిపోయాడని, కొంత కాలం పాటు అక్కడే ఉండి చివరకు దుబాయ్ వెళ్లినట్లు తెలుస్తోంది.బాధితుడు తన స్నేహితుడితో కలిసి మొత్తం పథకానికి సూత్రధారిగా మారడంతో కేసు షాకింగ్ మలుపు తిరిగింది. అయితే,విచారణలో,ఇండోర్ పోలీసులకు దావూద్, చోటా రాజన్ మధ్య ఘర్షణలు,మధ్యప్రదేశ్‌లో వారి రహస్య కార్యకలాపాల గురించి సమాచారం వచ్చింది"అని తెలిపారు.

    ఇక మరో షూటర్ విజయ్‌కుమార్‌ యాదవ్‌ అలియాస్ విక్కీ మల్హోత్రాను అరెస్టు చేయడానికి గతంలో కిడ్నాప్‌కు వాడిన ఫోన్‌ నెంబర్‌ ఎలా సాయపడింది వంటి చాల అంశాలున్నాయి.

    కరాచీలో తన కుమార్తె అంత్యక్రియల్లో పాల్గొన్న సమయంలో ఒకసారి,దుబాయ్‌లో మరోసారి దావూద్‌ను అంతం చేసేందుకు విక్కీ మల్హోత్రా ప్రయత్నాలు చేసినట్లు శైలేంద్ర వెల్లడించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మధ్యప్రదేశ్

    తాజా

    Golden Temple: పంజాబ్‌లోని స్వర్ణ దేవాలయాన్ని టార్టెట్‌ చేసిన పాక్‌.. భారత వైమానిక రక్షణ ఎలా కాపాడిందంటే? అమృత్‌సర్
    Sarfaraz Khan: ఫిట్‌నెస్‌ పై ఫోకస్‌.. 10 కేజీల బరువు తగ్గిన సర్ఫరాజ్‌ ఖాన్‌ సర్ఫరాజ్ ఖాన్
    Shreyas Iyer: ఐపీఎల్ చరిత్రలో తొలి కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ ఘనత శ్రేయస్ అయ్యర్
    Bill Gates: 2045 నాటికి మెరుగైన ప్రపంచం కోసం బిల్ గేట్స్ ఛాలెంజ్‌.. సాయం చేయాలంటూ తోటి బిలియనీర్లకు పిలుపు.. మైక్రోసాఫ్ట్

    మధ్యప్రదేశ్

    Madhya Pradesh: మధ్యప్రదేశ్ కేబినెట్ విస్తరణ.. ఓబీసీ కేటగిరీ నుంచి 11 మంది  భారతదేశం
    Madhya pradesh: మధ్యప్రదేశ్‌ బస్సులో మంటలు..13 మంది మృతి..మరో 17 మందికి గాయాలు  భారతదేశం
    Truck, bus drivers protest : దేశవ్యాప్తంగా డ్రైవర్లు సమ్మె.. హైవేలు దిగ్బంధనం.. పెట్రోల్ బంకులకు పోటెత్తిన జనం  కేంద్ర ప్రభుత్వం
    Girls missing: అక్రమంగా నిర్వహిస్తున్న చిల్డ్రన్స్ హోమ్ నుంచి 26 మంది బాలికలు మిస్సింగ్  భోపాల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025