
నిఠారీ కేసులో అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు.. సురేంద్ర, మణిందర్ మరణశిక్ష రద్దు
ఈ వార్తాకథనం ఏంటి
2006 నిఠారీ హత్య కేసులో దోషులుగా తేలిన అన్ని కేసుల్లో సురేంద్ర కోలీ, మోనీందర్ సింగ్ పంధేర్‌లను అలహాబాద్ హైకోర్టు సోమవారం నిర్దోషులుగా ప్రకటించింది.
సురేంద్ర కోలీకి 12కేసుల్లో, మోనీందర్ సింగ్ పంధేర్‌కు రెండు కేసుల్లో విధించిన మరణశిక్షను హైకోర్టు రద్దు చేసింది.
సీబీఐకి ఈ తీర్పు ఎదురు దెబ్బ అని చెప్పాలి. ఘజియాబాద్‌లోని సీబీఐ కోర్టు దోషులకు విధించిన మరణశిక్షను హైకోర్టు రద్దు చేసింది.
జస్టిస్ అశ్వినీ కుమార్ మిశ్రా, జస్టిస్ షరిజ్వీలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ మేరకు తీర్పు చెప్పింది.
అలహాబాద్ హైకోర్టు మోనీందర్ సింగ్ పందేర్‌పై మొత్తం 6 కేసులు ఉండగా, అన్నింటిలోనూ నిర్దోషిగా విడుదలైనట్లు మోనీందర్ సింగ్ పంధేర్ తరపు న్యాయవాది మనీషా భండారీ తెలిపారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సీబీఐకి ఎదురు దెబ్బ
BREAKING | Nithari Killings: #AllahabadHighCourt Acquits Surendra Koli In 12 Cases, Moninder Pander In 2 Cases; Sets Aside Death Sentence#NithariKillings #Nithari #DeathPenaltyhttps://t.co/sANhXHZXmp
— Live Law (@LiveLawIndia) October 16, 2023
కేసు
2006లో వెలుగులోకి కేసు..
2006లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాలోని మోనీందర్ సింగ్ పంధేర్ నివాసంలో, చుట్టుపక్కల మానవ అవశేషాలను పోలీసులు గుర్తించారు.
కోలీ.. పిల్లలకు మిఠాయిలు, చాక్లెట్లు ఆశ చూపి పిల్లలను తన ఇంటికి రప్పించుకొని వారిని హత్య చేసినట్లు సీబీఐ అభియోగాలు మోపింది.
ఆ తర్వాత బాలికల శవాలతో అతను లైంగిక కార్యకలాపాలు చేసేవాడని చెప్పింది. అంతేకాకుండా, అతనిపై నరమాంస భక్షక ఆరోపణలను సీబీఐ చేసింది.
ఈ కేసు అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ కోలీ, పంధేర్‌లను అరెస్టు చేసి, సీబీఐ కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేసింది.