LOADING...
Deepavali: యునెస్కో ఇన్‌టాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో దీపావళి
యునెస్కో ఇన్‌టాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో దీపావళి

Deepavali: యునెస్కో ఇన్‌టాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో దీపావళి

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 10, 2025
12:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

దీపావళి వచ్చిందంటే చాలు.. దీపాల వెలుగులు, బాణాసంచా పేలుళ్లతో అందరి ఇళ్లు మిరుమిట్లు గొలుపుతాయి. భారతీయుల హృదయాల్లో ప్రత్యేక స్థానం గల ఈ పండగకు అంతర్జాతీయంగా కూడా అసాధారణ గుర్తింపు లభించింది. యునెస్కో ఇన్‌టాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో దీపావళి పండగను చేర్చారు. ఈ నిర్ణయాన్ని దిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన సమావేశంలో యునెస్కో తీసుకుంది. దీంతో భారత్‌కు చెందిన 15 సాంస్కృతిక అంశాలు యునెస్కో వారసత్వంగా గుర్తింపు పొందాయి. ఇందులో కుంభమేళా, కోల్‌కతా దుర్గాపూజ, గర్బా నృత్యం, యోగా, వేద పఠన సంప్రదాయం, రామాయణ కథా ప్రదర్శన చేసే రామ్‌లీ వంటి అంశాలు ఉన్నాయి. ఈ సంప్రదాయాలను సంరక్షించడం అత్యవసరం అని యునెస్కో ప్రతినిధులు తెలిపారు.

వివరాలు 

ఈ నెల 13వ తేదీ వరకు దిల్లీ ఎర్రకోటలో యునెస్కో 20వ సదస్సు 

యునెస్కో 20వ సదస్సు ఈ నెల 13వ తేదీ వరకు దిల్లీ ఎర్రకోటలో జరుగుతోంది. భారత్‌లో యునెస్కో ఇన్‌టాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సమావేశం జరగడం ఇదే మొదటిసారి. మొత్తం 80 దేశాలు సమర్పించిన 67 ప్రతిపాదనలను కమిటీ సమీక్షిస్తోంది. ఈ సదస్సులో వందల మంది ప్రతినిధులు పాల్గొని సాంస్కృతిక అంశాల ప్రాముఖ్యతపై చర్చించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 దీపావళికి యునెస్కో గుర్తింపు

Advertisement