Page Loader
CM YOGI: 'డీప్‌ఫేక్' బారిన పడ్డ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. వీడియో వైరల్
CM YOGI: 'డీప్‌ఫేక్' బారిన పడ్డ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. వీడియో వైరల్

CM YOGI: 'డీప్‌ఫేక్' బారిన పడ్డ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. వీడియో వైరల్

వ్రాసిన వారు Stalin
Mar 11, 2024
11:48 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ డీప్‌ఫేక్ టెక్నాలజీ బారిన పడ్డారు. సీఎం ఆదిత్యనాథ్ డయాబెటిస్ మెడిసిన్‌ను ప్రమోట్ చేస్తున్న నకిలీ వీడియో వైరల్ అయ్యింది. 41 సెకన్ల ఈ వీడియోను ఒక న్యూస్ ఛానెల్ క్లిప్ నుంచి కట్ చేసినట్లు డీప్‌ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి క్రియేట్ చేశారు. వెంటనే దీనిపై స్పందించిన యూపీ పోలీసులు రంగంలోకి దిగి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 'గ్రేస్ గార్సియా' అనే ఫేస్‌బుక్ ఖాతాలో ఫిబ్రవరి 26న ఈ నకిలీ వీడియోను పోస్ట్ చేశారు. దీనికి సంబంధించి లక్నోలోని సైబర్ పోలీస్ స్టేషన్‌లో 2 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. ఈ వీడియోకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఫేస్‌బుక్ కార్యాలయం నుంచి పోలీసులు కోరారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

దర్యాప్తు చేపట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు