Page Loader
దిల్లీ: సోఫా ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం; 9 మందికి గాయాలు 
దిల్లీ: సోఫా ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం; 9 మందికి గాయాలు

దిల్లీ: సోఫా ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం; 9 మందికి గాయాలు 

వ్రాసిన వారు Stalin
Aug 09, 2023
03:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీలోని మాయాపురి ప్రాంతంలోని ఓ ఫ్యాక్టరీలో బుధవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. మంటలను ఆర్పే క్రమంలో ఇద్దరు పోలీసులు, ఏడుగురు పౌరులు గాయపడ్డారని అధికారులు తెలిపారు. గాంధీనగర్ మార్కెట్‌లోని రెండు అంతస్తుల సోఫా ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినట్లు సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ట్యాంకర్లతో మంటలను ఆర్పేశారు. సోఫా స్ప్రింగ్స్ ప్యాకింగ్ బాక్స్‌లో మంటలు చెలరేగాయని, గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంచిన జిగురు డ్రమ్ పగలడంతో మంటలు ఎక్కువగా వ్యాపించాయని అధికారులు వివరించారు. గాయపడిన వారిని డీడీయూ ఆసుపత్రికి తరలించారు. అగ్నిప్రమాదంపై దర్యాప్తు చేసేందుకు క్రైమ్‌ టీమ్‌ను రంగంలోకి దించారు. మాయాపురి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఎగిసిపడుతున్న మంటలు