
Delhi: 3.6డిగ్రీల సెల్సియస్@ దిల్లీలో ఈ సీజన్‌లోనే అత్యంత కనిష్టమైన ఉష్ణోగ్రతలు నమోదు
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర భారతదేశం మొత్తం చలిగాలులతో అల్లాడుతోంది. శనివారం ఉదయం దిల్లీలో ఉష్ణోగ్రత 3.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది ఈ సీజన్‌లో అత్యల్పంగా కావడం గమనార్హం.
దిల్లీలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రత ఇంతకంటే తక్కువగానే ఉంది. మరోవైపు దట్టమైన పొగమంచు, చలి దృష్ట్యా వాతావరణ శాఖ (ఐఎండీ) రెడ్ అలర్ట్ ప్రకటించింది.
పొగమంచు కారణంగా రైలు రాకపోకలు కూడా దెబ్బతిన్నాయి. దిల్లీ మీదుగా వెళ్లే 18 రైళ్లు 6 గంటల వరకు ఆలస్యంగా నడుస్తున్నాయి.
పంజాబ్, హర్యానా, చండీగఢ్‌లలో ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. చలి తీవ్రత తగ్గే అవకాశం లేకపోవడంతో మరో 3 రోజుల పాటు దిల్లీలో ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
చలి
జనవరి 12న 5 ఏళ్ల రికార్డును బద్దలు
పంజాబ్, తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలలో శనివారం ఉదయం దట్టమైన పొగమంచు ఉంది.
హర్యానా, మధ్యప్రదేశ్, బిహార్, అస్సాం, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్‌లో కూడా పొగమంచు నమోదైంది. ఈరోజు కూడా రాజస్థాన్‌లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
జనవరి 12న కూడా దిల్లీలో చలి 5 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. అప్పుడు రాజధానిలో ఉష్ణోగ్రత 3.9 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది గత 5 సంవత్సరాలలో కనిష్టం కావడం గమనార్హం.
హర్యానా, పంజాబ్‌లోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 6 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉంది.
చలితో పాటు దిల్లీ గాలి నాణ్యత కూడా చాలా దారుణంగా ఉంది.
సీపీసీబీ ప్రకారం శుక్రవారం దిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 340గా ఉంది.