Delhi Air Pollution Protest: ఢిల్లీ కాలుష్య నిరసనలో హింస: పోలీసులపై 'పెప్పర్ స్ప్రే'తో ఆందోళనకారులు దాడి.. 15 మంది అరెస్టు
ఈ వార్తాకథనం ఏంటి
దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యానికి వ్యతిరేకంగా జరిగిన నిరసన హింసాత్మకంగా మారింది. ఇండియా గేట్ సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఆందోళనలో కొందరు నిరసనకారులు పోలీసులు మీద పెప్పర్ స్ప్రే ప్రయోగించి ఉద్రిక్తత సృష్టించారు. ఈఘటనలో పలువురు పోలీసు సిబ్బంది గాయపడ్డారు. పోలీసుల సమాచారం ప్రకారం.. ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ కొంతమంది ఇండియా గేట్ వద్దకు చేరి నిరసన చేపట్టారు.ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టు కమాండర్ మాద్వి హిడ్మా ఫొటోలను,పోస్టర్లను కూడా వారు ప్రదర్శించినట్టు తెలిపారు. ఇండియా గేట్ వద్ద ర్యాలీలు,నిరసనలపై నిషేధం ఉండటంతో,సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఆందోళనలు జంతర్ మంతర్ వద్ద మాత్రమే చేయవచ్చని పోలీసులు వారికి వివరణ ఇచ్చారు.
వివరాలు
పోలీసులపై పెప్పర్ స్ప్రే ప్రయోగించడం ఢిల్లీలో ఇదే మొదటిసారి
అయినప్పటికీ వారు మాట పట్టించుకోకుండా రోడ్డును దిగ్బంధించేందుకు యత్నించారు. ఈ సమయంలో వారిని అడ్డుకునేందుకు ముందుకు వచ్చిన పోలీసులపై కొందరు నిరసనకారులు పెప్పర్ స్ప్రే వాడారు. ఫలితంగా ముగ్గురు-నలుగురు పోలీసుల కళ్లపై, ముఖంపై గాయాలు ఏర్పడ్డాయి. వెంటనే వారిని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. నిరసనల సమయంలో పోలీసులపై పెప్పర్ స్ప్రే ప్రయోగించడం ఢిల్లీలో ఇదే మొదటిసారి అని, ఇది చాలా అసాధారణమైన పరిణామమని న్యూఢిల్లీ డీసీపీ దేవేష్ కుమార్ మహ్లా వ్యాఖ్యానించారు.
వివరాలు
పోలీసులు అదుపులో 15 నుండి 20 మంది నిరసనకారులను
అల్లరి నేపథ్యంలో 15 నుండి 20 మంది నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ విధులకు భంగం కలిగించడం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మావోయిస్టు నేత పోస్టర్ల విషయం వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏంటన్నదానిపై కూడా పరిశీలన సాగుస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా, ఢిల్లీలో ఆదివారం రోజున ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 391కి చేరింది—ఇది 'చాలా ప్రమాదకరమైన' వర్గంలోకి వచ్చే స్థాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఢిల్లీలో కాలుష్య నిరసనలో తీవ్ర ఉద్రిక్తత
#WATCH | Delhi: A group of protesters holds a protest at India Gate over air pollution in Delhi-NCR. They were later removed from the spot by police personnel pic.twitter.com/DBEZTeET0U
— ANI (@ANI) November 23, 2025