
Delhi Baba: లైంగిక వేధింపుల కేసుల్లో దిల్లీ బాబా అరెస్టు
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీలో ప్రముఖ ఆశ్రమానికి చెందిన బాబా (Delhi Baba)పై లైంగిక వేధింపుల కేసు పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నది. ఈ కేసులో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. స్వామి చైతన్యానంద సరస్వతి పేరుతో గుర్తింపు పొందిన ఆ బాబాను పోలీసులు అరెస్టు చేశారు. వసంత్‌కుంజ్‌లోని శ్రీ శారద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మేనేజ్‌మెంట్ కళాశాల నిర్వహణ కమిటీలో సభ్యుడిగా స్వామి చైతన్యానంద సరస్వతి ఉన్నారు. ఆ కళాశాలలో చదువుతున్న 17 మంది విద్యార్థినులు ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసభ్య పదజాలంతో దూషించడం, అభ్యంతరకర సందేశాలు పంపించడం, విదేశీ పర్యటన పేరుతో మభ్యపెట్టడం వంటివి తనపై బాబా చేసిన వేధింపులుగా విద్యార్థినులు వెల్లడించారు.
Details
ఆగ్రాలో అరెస్టు చేసిన పోలీసులు
దీనిపై పోలీసులు విచారణ జరిపి సాక్ష్యాలు సేకరించారు. మొత్తం 32 మంది వాంగ్మూలం ఇవ్వగా, అందులో 17 మంది విద్యార్థినులు నేరుగా బాబాపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. వీటి ఆధారంగా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత బాబా అదృశ్యమయ్యాడు. ఆయన కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. చివరికి శనివారం అర్ధరాత్రి ఆగ్రాలోని ఒక హోటల్‌లో స్వామి చైతన్యానంద సరస్వతిని పోలీసులు అరెస్టు చేశారు.