LOADING...
Delhi Car blast: దిల్లీ పేలుడు ఘటనలో ఎరుపు రంగు ఫోర్డ్‌ ఎకోస్పోర్ట్‌ కారు స్వాధీనం
దిల్లీ పేలుడు ఘటనలో ఎరుపు రంగు ఫోర్డ్‌ ఎకోస్పోర్ట్‌ కారు స్వాధీనం

Delhi Car blast: దిల్లీ పేలుడు ఘటనలో ఎరుపు రంగు ఫోర్డ్‌ ఎకోస్పోర్ట్‌ కారు స్వాధీనం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 12, 2025
08:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ పేలుడు ఘటన దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఎర్రకోట పార్కింగ్‌ సమీపంలో పేలిన ఐ20 కారును నడిపిన నిందితుడి పేరుతో మరొక వాహనం నమోదైందని అధికారులు గుర్తించారు. ఆ ఎరుపు రంగు ఫోర్డ్‌ ఎకోస్పోర్ట్‌ కారు (DL10CK0458) కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు ప్రారంభించారు. చివరికి ఆ వాహనం హర్యానా రాష్ట్రంలోని ఒక గ్రామంలో లభ్యమై, స్వాధీనం చేసుకున్నారు. ఉమర్‌ నబీ పేరిట మరో కారు ఉందని తెలిసిన తర్వాత, దాన్ని కనిపెట్టేందుకు పోలీసులు పెద్ద స్థాయిలో ఆపరేషన్‌ నిర్వహించారు.

వివరాలు 

ఫరీదాబాద్‌ జిల్లాలోని ఖాండవాలీ గ్రామంలో కారు గుర్తింపు 

హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులకు సమాచారాన్ని అందించి అప్రమత్తం చేశారు. ప్రతి పోలీస్‌ స్టేషన్‌, సరిహద్దు చెక్‌పోస్టులు కూడా జాగ్రత్త చర్యలు చేపట్టాయి. ఆ ఎరుపు వాహనాన్ని గుర్తించేందుకు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సెర్చ్‌ ఆపరేషన్‌ ప్రారంభించారు. వాహన నంబరు, ఇతర వివరాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. చివరికి హరియాణా ఫరీదాబాద్‌ జిల్లాలోని ఖాండవాలీ గ్రామంలో ఆ కారును గుర్తించి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.