Delhi blast: ఢిల్లీ పేలుళ్ల దర్యాప్తులో కీలక మలుపు.. టర్కీలో పాకిస్తాన్ హ్యాండ్లర్ ఏర్పాటు చేసిన సమావేశానికి ముగ్గురు ఉగ్ర డాక్టర్లు
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీ బాంబు పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) తన విచారణను మరింత వేగంగా పెంచింది. దర్యాప్తు పురోగతిలో భాగంగా, ఈ దాడికి పాకిస్థాన్‌లో ఉన్న హ్యాండ్లర్లు, అలాగే అల్-ఖైదా వంటి అంతర్జాతీయ ఉగ్రస్థాయిలో పనిచేసే సంస్థలతో సంబంధాలు ఉన్నట్టు బయటపడింది. ఢిల్లీ దాడిలో పాల్గొన్న భారతీయ వైద్యులు ఉమర్ ఉన్ నబీ, ముజమ్మిల్ షకీల్ గనై, ముజఫ్ఫర్ రాథర్‌లను పాకిస్తాన్‌కు చెందిన ఉకాషా (Ukasha) అనే హ్యాండ్లర్ సూచనల మేరకు టర్కీకి వెళ్లినట్టు నిర్ధారించారు. ఉకాషా అఫ్ఘానిస్తాన్-పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో తలదాచుకుని, ఒక సిరియా పౌరుడితో కలిసి యువతను తీవ్రవాద దిశగా మలుస్తున్నాడని దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది.
వివరాలు
ఉమర్ జమ్ముకశ్మీర్‌లోని పంపోర్ లో నిధుల సేకరణ
టర్కీ నుంచి తిరిగి వచ్చిన ఉగ్రవాదభావజాలం కలిగిన వైద్యుల్లో ముజఫ్ఫర్ రాథర్ యూఏఈ ద్వారా అఫ్ఘానిస్తాన్ చేరి అక్కడ అల్-ఖైదా గుంపుతో చేరాడు. మరోవైపు,ఉమర్ ఉన్ నబీని భారత్‌లోనే ఉండి పెద్ద స్థాయి ఆపరేషన్‌కు సిద్ధంగా ఉండాలని ఉకాషా ఆదేశించాడు. ఆసూచనలతో ఉమర్ హర్యానాలోని అల్ ఫలా యూనివర్సిటీలో చేరి, అక్కడ తన నెట్‌వర్క్‌ను మరింత విస్తరించాడు. పేలుడు చోటు చేసుకునే వారం ముందుగానే ఉమర్ జమ్ముకశ్మీర్‌లోని పంపోర్‌కి వెళ్లి నిధుల సేకరణ చేపట్టాడు. ఈక్రమంలో అమీర్ రషీద్ అలీ కూడా అతనికి సహకరించాడు. పేలుడుకు ఉపయోగించిన కారు అమీర్ తన పేరుతోనే కొనుగోలు చేసినట్టు తెలిసింది. అతడికి స్వయంగా సూసైడ్ బాంబింగ్ ఆపరేషన్ గురించి పూర్తిగా తెలిసినట్టుగా ఎన్ఐఏ అధికారులు గుర్తించారు.