LOADING...
Delhi blast: డీ-6 టెరర్ ప్లాన్: ఆరు నగరాలను టార్గెట్ చేసిన ఉగ్ర గుంపు..! 
డీ-6 టెరర్ ప్లాన్: ఆరు నగరాలను టార్గెట్ చేసిన ఉగ్ర గుంపు..!

Delhi blast: డీ-6 టెరర్ ప్లాన్: ఆరు నగరాలను టార్గెట్ చేసిన ఉగ్ర గుంపు..! 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 17, 2025
10:42 am

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనపై దర్యాప్తుసంస్థలు వేగంగా తనిఖీలు కొనసాగిస్తున్నాయి. ఈ కేసు ముందుకు సాగుతుండగా మేడమ్ సర్జన్,డీ-6 వంటి కీలక పదాలు బయటపడుతున్నాయి. నిషేధిత జైషే మహ్మద్, అన్సార్ గజ్వత్-ఉల్-హింద్ ఉగ్ర సంస్థలతో అనుబంధం ఉన్న 43ఏళ్ల షాహిన్ షాహిద్‌ (Madam Surgeon)ఈ నెట్‌వర్క్‌లో ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు విచారణలో తేలుతోంది. ఈ ఉగ్ర మాడ్యూల్‌ దేశవ్యాప్తంగా ఉన్న ఆరునగరాలను లక్ష్యంగా చేసుకొని'డీ-6 మిషన్'పేరుతో కుట్రలు పన్నుతున్నట్టు అధికారులు గుర్తిస్తున్నారు. లక్ష్య నగరాల ఎంపిక, రిక్రూట్‌మెంట్‌ పద్ధతులు,నిధుల పంపకం,గోప్యంగా సమాచారాన్నిమార్పిడి చేసే మార్గాలు వంటి కీలక వివరాలు బయటపడుతున్నాయి. జమ్ముకశ్మీర్‌,ఫరీదాబాద్‌లో అరెస్టు చేసిన అనుమానితుల్ని విచారించిన సమయంలో ఈ మొత్తం వివరాలు వెలుగులోకి వచ్చినట్లు దర్యాప్తు వ్యవస్థలు చెబుతున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఆరు నగరాల్లో 'ఆపరేషన్‌ డీ-6' కుట్ర..!