Arvind Kejriwal: దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు
లోక్‌సభ ఎన్నికలకు వేళ.. దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట లభించింది. కేజ్రీవాల్‌కు రూస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. విచారణకు హాజరు కాకపోవడంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేసిన ఫిర్యాదుల నేపథ్యంలో శనివారం కేజ్రీవాల్ రూస్ అవెన్యూ కోర్టుకు హాజరయ్యారు. దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు తాము జారీ చేసిన సమన్లను ఆయన పాటించడం లేదని ఈడీ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అలాగే, ఈడీ దాఖలు చేసిన ఫిర్యాదులు, సమన్లపై స్టే విధించాలని కోరుతూ అరవింద్ కేజ్రీవాల్ చేసిన విజ్ఞప్తిని దిల్లీ కోర్టు శుక్రవారం తిరస్కరించింది. అలాగే, కేజ్రవాల్‌ను శనివారం హాజరుకావాలని ఆదేశించింది. దీంతో కేజ్రీవాల్ కోర్టు ముందు హాజరయ్యారు.