LOADING...
Medha Patkar : మహిళా ఉద్యమకారిణి మేధా పాట్కర్‌కు ఢిల్లీ కోర్టు ఐదు నెలల జైలు శిక్ష  
మహిళా ఉద్యమకారిణి మేధా పాట్కర్‌కు ఢిల్లీ కోర్టు ఐదు నెలల జైలు శిక్ష Add Image

Medha Patkar : మహిళా ఉద్యమకారిణి మేధా పాట్కర్‌కు ఢిల్లీ కోర్టు ఐదు నెలల జైలు శిక్ష  

వ్రాసిన వారు Stalin
Jul 01, 2024
05:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

సామాజిక కార్యకర్త, నర్మదా బచావో ఆందోళన్(ఎన్‌బిఎ)నాయకురాలు మేధా పాట్కర్‌కు ఢిల్లీ కోర్టు జూలై 1న ఆమెకు ఐదునెలల జైలు శిక్ష విధించింది. ఆమెపై ప్రస్తుత లెఫ్టినెంట్-గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా దాఖలు చేసిన రెండుదశాబ్దాల నాటి క్రిమినల్ పరువు నష్టం కేసులో ఢిల్లీ కోర్టు ఈ శిక్ష విధించింది. ఢిల్లీసాకేత్ కోర్టు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ రాఘవ్ శర్మ మే25న భారత శిక్షాస్మృతి,1860లోని సెక్షన్ 500 ప్రకారం పరువు నష్టం కలిగించిన నేరానికి పాట్కర్‌ను దోషిగా నిర్ధారించారు. కాగా కోర్టు తీర్పుపై పాట్కర్ స్పందించారు. తాను ఎవరినీ కించపరిచే ప్రయత్నం చేయలేదని, నిర్ణయాన్ని సవాలు చేస్తానని అన్నారు."సత్యాన్ని ఎప్పటికీ ఓడించలేము..మేము ఎవరినీ కించపరచడానికి ప్రయత్నించలేదన్నారు..మేము కోర్టు తీర్పును సవాలు చేస్తాము" అని ఆమె చెప్పారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మేధా పాట్కర్‌కు ఐదు నెలల జైలు శిక్ష