Atal Canteens : వాజ్‌పేయీ వర్ధంతి సందర్భంగా దిల్లీలో 25 కొత్త అటల్ క్యాంటీన్లు ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీలో అటల్ క్యాంటీన్ల ద్వారా పేదల ఆకలి బాధలను దూరం చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి రేఖాగుప్తా తెలిపారు. అటల్ బిహారీ వాజ్‌పేయీ వర్ధంతిని పురస్కరించుకుని ఆదివారం దిల్లీలో ఏర్పాటు చేసిన 25 కొత్త అటల్ క్యాంటీన్లను ఆమె పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో కలిసి ప్రారంభించారు. తాజాగా ప్రారంభించిన క్యాంటీన్లతో కలిపి దిల్లీలో అటల్ క్యాంటీన్ల సంఖ్య 100కు చేరిందని సీఎం రేఖాగుప్తా తెలిపారు. నగరంలోని ప్రతి ఒక్కరికీ ఈ క్యాంటీన్ల సేవలు అందుబాటులోకి తీసుకురావడమే తమ ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు.
వివరాలు
వాజ్‌పేయీ జయంతికి 100 క్యాంటీన్ల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం
క్యాంటీన్ల ప్రారంభ కార్యక్రమంలో పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీఎం రేఖాగుప్తా, పలువురు ప్రజా ప్రతినిధులు భోజనం చేశారు.
క్యాంటీన్లలో అందిస్తున్న భోజనం నాణ్యతను వారు పరిశీలించి, మెచ్చుకున్నారు.
వాజ్‌పేయీ జయంతి సందర్భంగా 2025 డిసెంబరు 25న దిల్లీలో 100 అటల్ క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని రేఖాగుప్తా తెలిపారు.
ఆ లక్ష్యాన్ని ఆయన వర్ధంతి నాటికి పూర్తి చేసి, 100 క్యాంటీన్లను ప్రజలకు అంకితం చేశామని ఆమె వెల్లడించారు.