నూతన సీఎస్‌గా పీకే సింగ్‌ను నియమించిన దిల్లీ ప్రభుత్వం; కేంద్రానికి ప్రతిపాదనలు
ఈ వార్తాకథనం ఏంటి
కొత్త ప్రధాన కార్యదర్శిగా 1989బ్యాచ్ ఐఏఎస్ అధికారి పీకే గుప్తాను నియమించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని దిల్లీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరింది.
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్రం సమ్మతి కోసం ఎల్జీ వీకే సక్సేనాకు పీకే గుప్తా నియామకం ప్రతిపాదనను పంపారు.
ప్రస్తుతం దిల్లీ ప్రభుత్వ సాధారణ పరిపాలన విభాగంలో అదనపు ప్రధాన కార్యదర్శిగా పీకే గుప్తా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఇటీవల సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీం కోర్ట్ బెంచ్ దిల్లీలో పనిచేసే బ్యూరోక్రాట్లపై నియంత్రణ ఎన్నికైన ప్రభుత్వం చేతుల్లో ఉంటుందని తీర్పు చెప్పింది.
ఈ క్రమంలో ప్రభుత్వానికి సహకరించని అధికారులపై కేజ్రీవాల్ ప్రభుత్వం వేటు వేస్తోంది.
దిల్లీ
మరింత మంది అధికారులను తొలగించే ఆలోచనలో దిల్లీ ప్రభుత్వం
ప్రస్తుత ప్రధాన కార్యదర్శి నరేష్ కుమార్ 2022లో నియామకం అయ్యారు. సీఎస్ నరేష్ కుమార్, దిల్లీ ప్రభుత్వం మధ్య సత్సంబంధాలు లేవు.
అనేక సందర్భాల్లో కేజ్రీవాల్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిలివేశారు.
అంతేకాకుండా కేజ్రీవాల్ ప్రభుత్వం ఆశిష్ మోర్‌ను సర్వీసెస్ సెక్రటరీగా తొలగించింది. అతనికి షోకాజ్ నోటీసు జారీ చేసింది. మంత్రి సౌరభ్ భరద్వాజ్ సూచనలను పాటించనందుకు కేజ్రీవాల్ ప్రభుత్వం ఆశిష్ మోర్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని చెప్పింది.
దిల్లీలోని సివిల్ సర్వీసెస్ బోర్డు(సీఎస్బీ) సెక్రటరీగా ఏకే సింగ్‌ను నియమించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
సింగ్ నియామకానికి సంబంధించిన ఫైల్‌ను ఎల్జీ ఆమోదం కోసం పంపారు. ఇంకా పలువురు అధికారులపై ప్రభుత్వం కొరడా ఝులిపించే అవకాశం ఉందని తెలుస్తోంది.