LOADING...
Delhi: ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు రద్దు.. రాష్ట్రపతి భవన్ సహా అనేక చోట్ల విద్యుత్ సరఫరా నిలిపివేత
ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు రద్దు.. రాష్ట్రపతి భవన్ సహా అనేక చోట్ల విద్యుత్ సరఫరా నిలిపివేత

Delhi: ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు రద్దు.. రాష్ట్రపతి భవన్ సహా అనేక చోట్ల విద్యుత్ సరఫరా నిలిపివేత

వ్రాసిన వారు Sirish Praharaju
May 08, 2025
10:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్, రాజస్థాన్‌లోని అనేక ప్రాంతాల్లో పాకిస్థాన్ వైమానిక దాడుల తర్వాత, సరిహద్దు పట్టణాల్లోని జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఢిల్లీలో, ముఖ్యమంత్రి రేఖ గుప్తా గురువారం ప్రభుత్వ ఉద్యోగుల సెలవులను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రపతి భవన్‌తో సహా మొత్తం ఢిల్లీలో విద్యుత్తు సరఫరా నిలిపేశారు. నగరంలో పోలీసులు, భద్రతా దళాలు కూడా అప్రమత్తంగా ఉన్నాయి.

వివరాలు 

జమ్మూ కాశ్మీర్‌లో డ్రోన్ దాడులు, కూల్చివేత 

పాకిస్తాన్ సైన్యం జమ్మూ, పంజాబ్, రాజస్థాన్ లోని అనేక ప్రాంతాలపై డ్రోన్లతో దాడి చేసింది. దీని తరువాత, జమ్మూలో సైరన్లు మ్రోగాయి. అనంతరం విద్యుత్ సరఫరా నిలిపివేశారు. పాకిస్తాన్ ఈ దాడిలో క్షిపణులు,ఆత్మాహుతి డ్రోన్లను ఉపయోగించింది. వీటిని కూడా భారత బలగాలు గాల్లోనే ధ్వంసం చేశాయి. భారతదేశం మొత్తం దాడిని భగ్నం చేసి, పాకిస్తాన్ F-16 ఫైటర్ జెట్‌తో సహా 8 క్షిపణులను కూల్చివేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఉత్తర్వులు జారీ చేసిన ఢిల్లీ ప్రభుత్వం