
Delhi High Court:ఢిల్లీ హైకోర్టులో వర్చువల్ విచారణలో లాయర్ అనుచిత ప్రవర్తన: కెమెరా ఆన్‌లో ఉండగానే మహిళకు ముద్దు.. వీడియో వైరల్
ఈ వార్తాకథనం ఏంటి
ఢిల్లీ హైకోర్టులో జరిగిన ఓ వర్చువల్ విచారణలో,న్యాయ వృత్తిలో ఉండాల్సిన శ్రద్ధను లాయర్ పాటించకపోవడం తీవ్ర చర్చలకు దారి తీసింది. కేసు విచారణ సమయంలో, కెమెరా ఆన్‌లో ఉన్నప్పుడు ఆ లాయర్ ఒక మహిళను ముద్దుపెట్టడం కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, సదరు లాయర్ తీరుపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఆన్‌లైన్ లో లాగిన్ అయిన ఇతరులు న్యాయమూర్తి విచారణ ప్రారంభం కోసం ఎదురు చూసే సమయంలోనే ఈ అనుచిత ప్రవర్తన చోటు చేసుకుంది. కోర్టు దుస్తులు ధరించిన ఆ లాయర్, కెమెరాకు కొంచెం పక్కన కూర్చుని ఉన్న సమయంలో, ముందున్న మహిళ చేతిని పట్టుకుని దగ్గరకు లాగారు.
వివరాలు
వృత్తిగత ప్రవర్తనపై వెల్లువెత్తుతున్న విమర్శలు
మహిళ వెనక్కి తగ్గేందుకు ప్రయత్నించినప్పటికీ, ఆయన ముద్దు పెట్టడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఈ వీడియోలో ఉన్న లాయర్, మహిళ ఎవరనే వివరాలు ఇంకా తెలియరాలేదు. వీడియో అసలు నిజమేనా అన్నది కొన్ని జాతీయ మీడియా సంస్థలు ధృవీకరించలేకపోవడం వల్ల, నెటిజన్లలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. కొందరు నెటిజన్లు "ఇది చాలా సిగ్గుచేటు", "న్యాయవ్యవస్థ పవిత్రతను దెబ్బతీసే పని" అని వ్యాఖ్యానించారు. మరికొందరు వ్యంగ్యంగా "న్యాయం గుడ్డిది కావచ్చు, కానీ ఇప్పుడు కెమెరాలో బంధీ అయింది" అని వ్యాఖ్యానించారు. వృత్తిగత నిబంధనలను ఉల్లంఘించిన లాయర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని పలు వర్గాలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన, వర్చువల్ విచారణల పర్యవేక్షణ, న్యాయవాదుల ప్రవర్తనపై కొత్త చర్చలకు కారణమైంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కెమెరా ఆన్‌లో ఉండగానే మహిళకు ముద్దు.. వీడియో వైరల్
Welcome to Digital India Justice 😂
— ShoneeKapoor (@ShoneeKapoor) October 15, 2025
Court is online… but judge forgot it’s LIVE! ☠️
When tech meets tradition
— and the camera off button loses the case! 🤣 pic.twitter.com/1GbfOFQ6w7