LOADING...
Delhi High Court: ఢిల్లీ హైకోర్టుకు ఈడీ.. సోనియా గాంధీ, రాహుల్‌కు నోటీసులు
ఢిల్లీ హైకోర్టుకు ఈడీ.. సోనియా గాంధీ, రాహుల్‌కు నోటీసులు

Delhi High Court: ఢిల్లీ హైకోర్టుకు ఈడీ.. సోనియా గాంధీ, రాహుల్‌కు నోటీసులు

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 22, 2025
03:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

నేషనల్ హెరాల్డ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) దాఖలు చేసిన ఛార్జిషీటుపై ట్రయల్ కోర్టు ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులను ఎడీ హైకోర్ట్‌లో సవాలు చేసింది. దీనివల్ల,ఈ కేసులో నిందితులుగా ఉన్న కాంగ్రెస్ నేతలు..సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తదితరులకు హైకోర్ట్ నుండి నోటీసులు జారీ అయ్యాయి. ఈడీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హైకోర్టులో హాజరయ్యారు. ఈడీ దర్యాప్తు పూర్తిచేసి,సంబంధిత సాక్ష్యాలను సేకరించిందని, కేసులో అనేక సోదాలు కూడా నిర్వహించిందని ఆయన చెప్పారు.

వివరాలు 

కోర్టు చార్జిషీటును తిరస్కరిస్తూ ఉత్తర్వులు జారీ 

అయితే,దిగువ కోర్టు ఈడీ చార్జిషీటును పరిగణనలోకి తీసుకోకుండా తప్పు తీర్పు ఇచ్చిందని ఆయన వాదించారు. హైకోర్టు ఈ కేసులో తదుపరి విచారణను 2026 మార్చి 12వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు, నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దాఖలు చేసిన చార్జిషీటును పూర్వం ఢిల్లీ కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. కోర్టు చార్జిషీటును తిరస్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా కాకుండా, ప్రైవేటు వక్తి సుబ్రమణ్యం స్వామి దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా చార్జిషీటును పరిగణనలోకి తీసుకోలేమని ఢిల్లీ కోర్టు ప్రత్యేక జడ్జి విశాల్ గాగ్నే తప్పుపట్టారు.

వివరాలు 

ఈడీకి దర్యాప్తును కొనసాగించడానికి  కోర్టు అనుమతి

అలాగే, ఢిల్లీ పోలీస్ శాఖ ఆర్థిక నేరాల విభాగం ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం గుర్తుచేశారు. అట్టి పరిస్థితుల్లో, ఈడీ చార్జిషీటుపై తీర్పు ఇవ్వడం తొందరపాటు అని కోర్టు అభిప్రాయపడింది. అయితే, కోర్టు ఈడీకి దర్యాప్తును కొనసాగించడానికి అనుమతి ఇచ్చింది. ఈడీ చార్జిషీటులో సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో పాటు సుమన్ దూబే, శామ్ పిట్రోడా, యంగ్ ఇండియన్, డోటెక్స్ మర్చండైజ్, సునీల్ భండారి తదితరుల పేర్లు చేర్చచారు.

Advertisement