Loading...
Delhi: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ పరిసరాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ పరిసరాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేత

Delhi: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ పరిసరాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేత

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 23, 2026
08:05 am

ఈ వార్తాకథనం ఏంటి

నీట్-2026 ప్రశ్నపత్రం లీక్ అంశంపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ), కాంగ్రెస్ పార్టీ చేపట్టిన వరుస ఆందోళనలతో దేశ రాజధాని దిల్లీలో గత రెండు రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. జంతర్ మంతర్‌తో పాటు దాని పరిసర ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు వెల్లడించారు. జంతర్ మంతర్‌లో నిరంతరం కొనసాగుతున్న నిరసన కార్యక్రమాల దృష్ట్యా శాంతిభద్రతలను పరిరక్షించడం, తప్పుడు సమాచారం సోషల్ మీడియాలో వేగంగా వ్యాప్తి చెందకుండా అడ్డుకోవడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని అధికారులు స్పష్టం చేశారు.

వివరాలు 

పోలీసుల ఆధీనంలోకి జంతర్ మంతర్

మరోవైపు నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతుండటంతో పాటు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

జంతర్ మంతర్ ప్రాంతాన్ని పూర్తిగా పోలీసుల ఆధీనంలోకి తీసుకుని భారీ సంఖ్యలో భద్రతా బలగాలను మోహరించారు.

ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంపై కాక్రోచ్ జనతా పార్టీతో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థుల ఉద్యమాన్ని అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య విరుద్ధ చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తున్నాయి.

వివరాలు 

చలో పార్లమెంట్ ఆందోళన ఉద్రిక్తం

నీట్-2026 పేపర్ లీక్ ఘటనతో పాటు నీట్ అభ్యర్థుల మరణాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జులై 20న కాక్రోచ్ జనతా పార్టీ "చలో పార్లమెంట్" (చలో సంసద్) కార్యక్రమానికి పిలుపునిచ్చింది.

ఈ కార్యక్రమం సందర్భంగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారి హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.

ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పాటు టియర్ గ్యాస్ ప్రయోగించారు.

దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఆందోళన హింసాత్మక రూపం దాల్చింది.

ADVERTISEMENT

వివరాలు 

కాంగ్రెస్ మెరుపు ధర్నా

సీజేపీ నిర్వహించిన పార్లమెంట్ మార్చ్ సందర్భంగా నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం,టియర్ గ్యాస్ ప్రయోగించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ మంగళవారం (జులై 21) ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్‌లో ఉన్న ప్రధాని నివాసాన్ని ముట్టడించేందుకు యత్నించింది.

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ మెరుపు ధర్నా చేపట్టింది.

ఈ నిరసనలో ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు పలువురు సీనియర్ నేతలు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ADVERTISEMENT

వివరాలు 

కాంగ్రెస్ మెరుపు ధర్నా

ప్రభుత్వ తీరును నిరసిస్తూ నేతలంతా చేతులకు తాళ్లు కట్టుకుని ఆందోళనలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తోందని ఆరోపించారు.

ప్రజలు గొంతెత్తితే బేడీలు వేసి అణచివేయాలని చూస్తోందని విమర్శించారు.

అలాగే ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తమ పదవులకు రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ మరోసారి డిమాండ్ చేసింది.

ADVERTISEMENT