Page Loader
MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు మళ్ళీ చుక్కెదురు.. జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు 
ఎమ్మెల్సీ కవితకు మళ్ళీ చుక్కెదురు.. జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు

MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు మళ్ళీ చుక్కెదురు.. జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు 

వ్రాసిన వారు Sirish Praharaju
May 20, 2024
04:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ రిమాండ్‌ను రోజ్ అవెన్యూ ప్రత్యేక కోర్టు సోమవారం పొడిగించింది. కవితకు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగిస్తూ న్యాయమూర్తి కావేరీ బవేజా ఉత్తర్వులు జారీ చేశారు. లిక్కర్ పాలసీ కేసులో కవితను రెండు నెలల క్రితం ఈడీ అరెస్ట్ చేసింది. ఆమె రెండు నెలలుగా తీహార్ జైలులో ఉంటోంది. ఆమె జ్యుడీషియల్ రిమాండ్‌ను ప్రత్యేక సీబీఐ కోర్టు పలుమార్లు పొడిగించింది. కవిత రిమాండ్‌ను జూన్ 3 వరకు పొడిగించింది కోర్టు. కవితను వర్చువల్‌గా కోర్టులో హాజరుపరిచారు అధికారులు.