Page Loader
దిల్లీ మద్యం పాలసీ కేసు: ఛార్జిషీట్‌లో ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా పేరును చేర్చిన ఈడీ 

దిల్లీ మద్యం పాలసీ కేసు: ఛార్జిషీట్‌లో ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా పేరును చేర్చిన ఈడీ 

వ్రాసిన వారు Stalin
May 02, 2023
01:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ మద్యం పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మంగళవారం తన రెండో అనుబంధ ఛార్జిషీట్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా పేరును చేర్చింది. మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా నివాసంలో చద్దాతో మద్యం పాలసీపై సమావేశం జరిగిందని సిసోడియా మాజీ కార్యదర్శి అరవింద్ ఈడీకి తెలిపారు. ఈ సమావేశానికి పంజాబ్ ఎక్సైజ్ కమిషనర్ వరుణ్ రూజం, కేసులో నిందితుడైన విజయ్ నాయర్, పంజాబ్ ఎక్సైజ్ డైరెక్టరేట్‌కు చెందిన అధికారులు కూడా హాజరైనట్లు అరవింద్ వాగ్మూలం ఇచ్చారు. ఈ కేసులో ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియా ఇప్పటికే జైలులో ఉన్నారు. మద్యం పాలసీ కేసుపై ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను కూడా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇటీవల విచారించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

దిల్లీ మద్యం కేసులో అనుబంధ ఛార్జీషీటు దాఖలు చేసిన ఈడీ