NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Delhi Air Pollution: ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం.. 300కి చేరిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్..
    తదుపరి వార్తా కథనం
    Delhi Air Pollution: ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం.. 300కి చేరిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్..
    ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం.. 300కి చేరిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్..

    Delhi Air Pollution: ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం.. 300కి చేరిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 28, 2024
    11:50 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశ రాజధాని ఢిల్లీ వాయు కాలుష్య స్థాయి రోజు రోజుకు మారుతోంది. ఈ రోజు (నవంబర్ 28 తేదీ) ఉదయం, ఢిల్లీలోని హస్తిన ప్రాంతంలో వాయు కాలుష్య స్థాయి ఏక్యూఐ 300కు చేరింది.

    సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తెలిపిన వివరాల ప్రకారం, ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో గాలి నాణ్యత "చాలా దారుణంగా" ఉన్నట్లు పేర్కొంది.

    ఇండియా గేట్ వద్ద భారీ పొగమంచు కమ్ముకుంది, అలాగే కాళింది కుంజ్ ప్రాంతంలో యమునా నదిలో విషపు నురుగు భారీగా ప్రవహిస్తుందని వెల్లడించింది.

    పలు ప్రాంతాలలో వాయు కాలుష్యం కారణంగా కంటి నొప్పులు, గొంతు సమస్యలు, శ్వాస తీసుకోవడంలో కష్టాలు ఉంటున్నాయని ప్రజలు అంగీకరించారు.

    వివరాలు 

    ఢిల్లీలో దట్టమైన పొగమంచు కురిసే అవకాశం

    ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో కురుస్తున్న పొగమంచు సూర్యరశ్మిని అడ్డుకుంటుంది, దీని వల్ల శరీరంలో ఎముకలు బలహీనంగా మారుతున్నట్లు ఎయిమ్స్‌ సంస్థ అధ్యయనంలో వెల్లడైంది.

    సూర్య కాంతి నుంచి వచ్చే UVA, UVB కిరణాలు మన శరీరంలో విటమిన్ D3 ఉత్పత్తికి అవసరమైన ముఖ్యమైన మూలకాలు. పొగమంచు కారణంగా, శీతాకాలంలో సూర్యరశ్మి భూమిపై చేరకుండా అడ్డుకుంటున్నట్లు వెల్లడించారు.

    ఎయిమ్స్‌ నిపుణులు చేప్పిన ప్రకారం, ఢిల్లీ మరియు గురుగ్రామ్‌లలో నిర్వహించిన అధ్యయనంలో సూర్యరశ్మి తగ్గిపోవడం వల్ల విటమిన్ D లోపం పెరుగుతున్నట్లు తెలియజేశారు.

    ఢిల్లీలో వాయు కాలుష్య స్థాయి పెరిగిన నేపథ్యంలో పొగమంచు తీవ్రత మరింత అధికం అవుతోంది.

    ఈరోజు ఢిల్లీలో దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణశాఖ ఎల్లో అలర్ట్‌ ప్రకటించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    వాయు కాలుష్యం

    తాజా

    Maharashtra Tragedy: షోలాపూర్ టెక్స్‌టైల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. ఏడాదిన్నర చిన్నారితో సహా 8 మంది మృతి  మహారాష్ట్ర
    Golden Temple: పంజాబ్‌లోని స్వర్ణ దేవాలయాన్ని టార్టెట్‌ చేసిన పాక్‌.. భారత వైమానిక రక్షణ ఎలా కాపాడిందంటే? అమృత్‌సర్
    Sarfaraz Khan: ఫిట్‌నెస్‌ పై ఫోకస్‌.. 10 కేజీల బరువు తగ్గిన సర్ఫరాజ్‌ ఖాన్‌ సర్ఫరాజ్ ఖాన్
    Shreyas Iyer: ఐపీఎల్ చరిత్రలో తొలి కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ ఘనత శ్రేయస్ అయ్యర్

    దిల్లీ

    Delhi Air Quality: ఢిల్లీలో పొల్యూషన్ డేంజర్ బెల్స్.. దారుణంగా పడిపోయిన ఎయిర్ క్వాలిటీ లెవెల్స్ భారతదేశం
    VK Saxena: చెట్ల నరికివేతకు న్యాయస్థానం అనుమతి తీసుకోవాలనే విషయం.. నాకు తెలీదు: సుప్రీంకోర్టుకు ఎల్జీ సమాధానం సుప్రీంకోర్టు
    Aravind Kejriwal : అరవింద్ కేజ్రీవాల్‌ వసతిపై హైకోర్టు నోటీసులు.. నవంబర్ 26న విచారణ అరవింద్ కేజ్రీవాల్
    Delhi BJP chief : యమునా నదిలో దిల్లీ బీజేపీ అధ్యక్షుడు స్నానం.. శ్వాసకోశ ఇబ్బందులతో ఆస్పత్రిలో చేరిక బీజేపీ

    వాయు కాలుష్యం

    గ్రీన్ హైదరాబాద్: ఫ్లై ఓవర్ల కింద ఆక్సిజన్ పార్కుల ఏర్పాటు హైదరాబాద్
    దిల్లీలో దయనీయంగా గాలి నాణ్యత.. లాక్‌డౌన్ దిశగా దేశ రాజధాని  దిల్లీ
    Delhi AQI 500: దిల్లీలో తీవ్రంగా క్షీణించినట్లు గాలి నాణ్యత.. కాలుష్యం కట్టడికి ప్రత్యేక చర్యలు దిల్లీ
    Delhi Schools Closed: దిల్లీలో పీక్‌లో వాయి కాలుష్యం.. నవంబర్ 10 వరకు ప్రైమరీ స్కూళ్ల మూసివేత దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025