LOADING...
Delhi: ఢిల్లీ తీవ్ర వాయు కాలుష్యం.. ఉద్యోగుల్లో 50%కు వర్క్ ఫ్రం హోం ఆదేశం
ఢిల్లీ తీవ్ర వాయు కాలుష్యం.. ఉద్యోగుల్లో 50%కు వర్క్ ఫ్రం హోం ఆదేశం

Delhi: ఢిల్లీ తీవ్ర వాయు కాలుష్యం.. ఉద్యోగుల్లో 50%కు వర్క్ ఫ్రం హోం ఆదేశం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 25, 2025
08:44 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్య స్థాయిలు తీవ్రంగా పెరిగిపోవడంతో,ఏక్యూఐ (వాయు నాణ్యత సూచీ) 382కి చేరిన నేపథ్యంలో పర్యావరణ శాఖ సోమవారం కీలక నిర్ణయం ప్రకటించింది. ఢిల్లీ పరిధిలోని ప్రభుత్వ,ప్రైవేటు కార్యాలయాలకు సంబంధించిన ఉద్యోగుల్లో సగం మంది ఇంటి నుంచే పని చేయాలని, మిగతా 50 శాతం మాత్రమే ఆఫీసులకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. పర్యావరణ పరిరక్షణ చట్టం-1986లోని సెక్షన్ 5 ప్రకారం ఈ ఉత్తర్వులు విడుదల చేసినట్లు వెల్లడించింది. అదేవిధంగా,ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.

వివరాలు 

ఈ నియమం వీరికి వర్తించదు 

నగరంలో వాహనాల సంచారం తగ్గి కాలుష్యం నియంత్రణలోకి రావాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. అన్ని సంస్థలు తప్పనిసరిగా 50 శాతం'వర్క్ ఫ్రం హోం'నిబంధనను అమలు చేయాలని ఆదేశిస్తూ, అత్యవసర సేవలైన ఆస్పత్రులు, ప్రజా రవాణా, నీటి సరఫరా, పారిశుద్ధ్యం, అగ్నిమాపక విభాగాలకు మాత్రం ఈ నియమం వర్తించదని స్పష్టంచేసింది.