Suicide attack: ఢిల్లీ ఆత్మాహుతి దాడికి ప్లాన్.. భగ్నం చేసిన పోలీసులు.. ఇద్దరు అరెస్టు
ఈ వార్తాకథనం ఏంటి
దేశ రాజధాని దిల్లీలో (Delhi) ఉగ్రవాదుల పెద్ద కుట్రను పోలీసులు అడ్డుకున్నారు. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో ఆత్మాహుతి దాడి జరిపేందుకు వారు సిద్ధమవుతుండగా, సమయానికి చర్యలు తీసుకున్న పోలీసులు ఆ యత్నాన్ని భగ్నం చేశారు. నిఘా సంస్థల సమాచారం మేరకు ఢిల్లీలోని సాదిక్‌నగర్,మధ్యప్రదేశ్‌లోని భోపాల్ ప్రాంతాల్లో ఢిల్లీ పోలీసుల ప్రత్యేక దళం (స్పెషల్ సెల్) సోదాలు చేపట్టింది. ఈ దర్యాప్తులో భాగంగా ఆత్మాహుతి దాడుల కోసం శిక్షణ పొందుతున్న ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు.
వివరాలు
అనుమానితుల వద్ద నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం
నిందితుల్లో ఒకరు భోపాల్‌కు చెందిన అద్నాన్ కాగా, మరొకరు మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యక్తి అని అధికారులు వెల్లడించారు. ప్రాథమిక విచారణలో వీరికి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ (ISIS)తో సంబంధాలు ఉన్నట్లు తేలిందని, ఢిల్లీలో భారీ ఆత్మాహుతి దాడి చేయాలనే యత్నం చేసినట్లు సమాచారం లభించిందని సీనియర్ అధికారి తెలిపారు. అనుమానితుల వద్ద నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి, అలాగే పలు ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీరిని మరింత విచారిస్తున్నామని, వారి నెట్‌వర్క్‌లో ఉన్న ఇతర వ్యక్తులను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు.