Loading...
CJI Protest:సీజేపీ నిరసనకారుల పాస్‌పోర్టుల రద్దుపై వైరల్ పోస్టులకు చెక్ పెట్టిన పోలీసులు
సీజేపీ నిరసనకారుల పాస్‌పోర్టుల రద్దుపై వైరల్ పోస్టులకు చెక్ పెట్టిన పోలీసులు

CJI Protest:సీజేపీ నిరసనకారుల పాస్‌పోర్టుల రద్దుపై వైరల్ పోస్టులకు చెక్ పెట్టిన పోలీసులు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 24, 2026
10:18 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధాని దిల్లీలో సీజేపీ (Cockroach Janta Party) ఆందోళనల సందర్భంగా హింసకు పాల్పడిన నిరసనకారుల పాస్‌పోర్టులను రద్దు చేయనున్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారాన్ని ఢిల్లీ పోలీసులు ఖండించారు. అలాంటి నిర్ణయం ఏదీ తీసుకోలేదని, దీనిపై అధికారిక ప్రకటన కూడా విడుదల కాలేదని స్పష్టం చేశారు. ఈ మేరకు డీసీపీ (న్యూ ఢిల్లీ) సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ,వైరల్ అవుతున్న పోస్టులు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజలు ఇలాంటి అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని, షేర్ చేయవద్దని, అధికారిక సమాచారం మాత్రమే విశ్వసించాలని సూచించారు.

వివరాలు 

జూలై 20న సీజేపీ పిలుపుతో ఢిల్లీలో భారీ ఎత్తున నిరసనలు

సీజేపీ నిరసనల్లో హింసకు పాల్పడిన వారిని సీసీటీవీ ఫుటేజ్, వీడియోలు, ఇతర సాంకేతిక ఆధారాల ద్వారా గుర్తించి, చట్టపరమైన చర్యల్లో భాగంగా పాస్‌పోర్టుల రద్దు ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉందంటూ కొన్ని మీడియా కథనాలు వెలువడ్డాయి.

అయితే అలాంటి సమాచారం వాస్తవం కాదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు.

జూలై 20న సీజేపీ పిలుపుతో ఢిల్లీలో భారీ ఎత్తున నిరసనలు జరిగాయి.

ఈ సందర్భంగా పోలీసులతో జరిగిన ఘర్షణల్లో పలువురు నిరసనకారులు, పోలీసు సిబ్బంది గాయపడ్డారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పాస్‌పోర్ట్ రద్దు నిర్ణయం లేదు.. వైరల్ ప్రచారాన్ని ఖండించిన ఢిల్లీ పోలీసులు

ADVERTISEMENT