Loading...
PM Modi: ప్రధానిపై వ్యాఖ్యలు చేసిన మైనర్ బాలికపై కేసు కొనసాగించం: దిల్లీ పోలీసులు
ప్రధానిపై వ్యాఖ్యలు చేసిన మైనర్ బాలికపై కేసు కొనసాగించం: దిల్లీ పోలీసులు

PM Modi: ప్రధానిపై వ్యాఖ్యలు చేసిన మైనర్ బాలికపై కేసు కొనసాగించం: దిల్లీ పోలీసులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 03, 2026
10:45 am

ఈ వార్తాకథనం ఏంటి

నీట్‌ పేపర్‌ లీక్‌ ఆందోళనల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మైనర్ బాలికపై నమోదు చేసిన కేసును కొనసాగించబోమని దిల్లీ పోలీసులు (Delhi Police) స్పష్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించి నోయిడా పోలీసులు ఇటీవల 'జీరో ఎఫ్‌ఐఆర్‌' నమోదు చేసి, దానిని దిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. బాలిక చేసిన వ్యాఖ్యలు ప్రధాని పదవిని అగౌరవపరిచేలా ఉండటంతో పాటు, శాంతిభద్రతలకు భంగం కలిగించే అవకాశముందని వచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదైంది. అయితే ప్రస్తుతం ఆ కేసును బాలికపై కొనసాగించడం లేదని దిల్లీ పోలీసులు వెల్లడించారు.

వివరాలు

ప్రధానికి క్షమాపణలు చెప్పిన బాలిక తల్లి

ఎఫ్‌ఐఆర్‌లో బాలిక వయసును 25 సంవత్సరాలగా నమోదు చేశారని, కానీ ఆమె అసలు వయసు 15 సంవత్సరాలు మాత్రమేనని ఆమె తల్లి వెల్లడించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ పరిణామాల మధ్య బాలిక తల్లి ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీకి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. తన కుమార్తెను క్షమించి పెద్ద మనసు చూపిన ప్రధాని మోదీని ఆమె ప్రశంసించారు.

అలాగే 18 ఏళ్లలోపు పిల్లలకు ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ వంటి సోషల్ మీడియా వేదికలను నిషేధించాలని ఆమె సూచించారు.

చిన్నారులు తెలియక ఇతరుల ప్రభావానికి సులభంగా లోనయ్యే ప్రమాదం ఉందని పేర్కొంటూ, వారి దృష్టి చదువులపైనే ఉండేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ADVERTISEMENT