Page Loader
Air Pollution: ఢిల్లీలో పడిపోయిన గాలి నాణ్యత.. కాలుష్య నియంత్రణ మండలి కీలక నిర్ణయం 
ఢిల్లీలో పడిపోయిన గాలి నాణ్యత.. కాలుష్య నియంత్రణ మండలి కీలక నిర్ణయం

Air Pollution: ఢిల్లీలో పడిపోయిన గాలి నాణ్యత.. కాలుష్య నియంత్రణ మండలి కీలక నిర్ణయం 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 14, 2024
04:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ (Delhi) ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది కూడా దేశ రాజధానిలో బాణాసంచా తయారీ, విక్రయాలు, నిల్వ, వినియోగంపై నిషేధం విధించింది (Cracker Ban). శీతాకాలం సందర్భంగా కాలుష్యాన్నిఅరికట్టడం కోసం ఈ నిర్ణయం తీసుకుంది. దీపావళి సందర్భంలో ఆన్‌లైన్‌ డెలివరీలు సహా అన్ని రకాల బాణాసంచా అమ్మకాలు,నిల్వ,తయారీ,కాల్చడంపై నిషేధం విధించింది. ఈ మేరకు ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిషేధం జనవరి 1,2025 వరకు అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. దీపావళి పండుగ నేపథ్యంలో బాణాసంచా అమ్మకాలు,తయారీపై నిషేధం విధించడం వరుసగా ఇది నాలుగోసారి. చలికాలంలో ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యానికి,సుప్రీంకోర్టు,ఎన్జీటీ సూచనల నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ అన్ని రకాల పటాకులను పూర్తిగా నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది