Page Loader
Delhi Liquor Case: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితకు మళ్లీ చుక్కెదురు 
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితకు మళ్లీ చుక్కెదురు

Delhi Liquor Case: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితకు మళ్లీ చుక్కెదురు 

వ్రాసిన వారు Stalin
Apr 24, 2024
08:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఢిల్లీ మద్యం కుంభకోణం(Delhi Liquor Case)కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు(MLC Kavitha)మళ్లీ చుక్కెదురైంది. రెగ్యులర్‌ బెయిల్‌ కోసం వేసిన పిటిషన్‌ పై విచారణ చేసిన ఢిల్లీలోని రౌజ్‌ ఎవెన్యూ కోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. రెగ్యులర్‌ బెయిల్‌ కు సంబంధించిన తీర్పును కోర్టు మే 6వ తేదీకి రిజర్వ్‌ చేసింది.అప్పటివరకు ఎమ్మెల్సీ కవిత తిహార్‌ జైలులోనే ఉండాల్సి వస్తోంది. రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌ ను బుధవారం విచారించిన రౌజ్‌ ఎవెన్యూ కోర్టు తీర్పును మే 7న వెలువరించనుంది. ఈడీ తరఫున జోయాబ్‌ హుస్సేన్‌ వాదనలు వినిపించారు. లిక్కర్‌ విధానం కేసుకు సంబంధించి ఈడీ పూర్తి విచారణ చేపట్టింది. ఎవరి పాత్ర ఏమిటనేదానిపై ఇప్పటికే ఒక నిర్ణయానికి వచి పూర్తి ఆధారాలను సేకరించింది.

Details 

లిక్కర్‌ కేసులో కీలకంగా వ్యవహరించిన కవిత 

లిక్కర్‌ కేసులో ఎమ్మెల్సీ కవిత దక్షిణాది నుంచి కీలకంగా వ్యవహరించారని ఈడీ తెలిపింది. ఈ మేరకు కవిత పాత్రపై పూర్తి ఆధారాలున్నాయని కోర్టు వెల్లడించింది. ఈ దశలో కవితకు బెయిల్‌ మంజూరు చేస్తే సాక్ష్యాలను, సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందని పేర్కొంది. కవితకు బెయిల్‌ మంజూరు చేయవద్దని ఈడీ తరఫు న్యాయవాది జోయబ్‌ హుస్సేన్‌ కోర్టుకు వెల్లడించారు. కవిత విచారణకు సహకరిస్తున్నట్లుగా 10 ఫోన్లను ఇచ్చారని అవన్నీ ఫార్మాట్‌ చేసిచ్చినవేనని తెలిపారు.

Details 

కవిత మధ్యంతర బెయిల్‌ ను కోర్టు నిరాకరించింది 

ఏ తప్పు చేయకుంటే ఢిల్లీ లిక్కర్‌ కేసుకు సంబంధించిన మెసేజ్లన్నీ ఎందుకు డిలీట్‌ చేయాల్సి వచ్చిందో వివరించాలన్నారు. దీనిపై కవితను విచారించగా ఆమె సరైన సమాధాన లివ్వలేదని, కొన్ని ప్రశ్నలకు ఉద్దేశపూర్వకంగానే కవిత స్పందించలేదని తెలిపారు. కవిత అడిగిన మధ్యంతర బెయిల్‌ ను కోర్టు నిరాకరించిందని, దాని గ్రౌండ్స్‌ ను కూడా రెగ్యులర్‌ బెయిల్‌ విచారణలోనూ పరిగణలోకి తీసుకోవాలని కోరారు.