Delhi Municipal By-Polls: ఢిల్లీ మున్సిపల్ బైపోల్స్‌లో 7 స్థానాలు కైవసం చేసుకున్న బీజేపీ
ఈ వార్తాకథనం ఏంటి
దేశ రాజధాని దిల్లీలో జరిగిన మున్సిపల్ ఉప ఎన్నికల్లో బీజేపీ జెండాలు రెపరెపలాడాయి. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD)లోని 12 వార్డుల్లో ఎన్నికలు జరిగాయి,వీటిలో బీజేపీ ఏడింటిని గెలిచింది. ఆరు స్థానాలను ఆమ్ ఆద్మీ పార్టీ,ఒక్కో స్థానాన్ని కాంగ్రెస్,వామపక్ష పార్టీలు గెలిచాయి. నవంబర్ 30న పోలింగ్ జరిగింది. గతంలో 12 వార్డుల్లో బీజేపీ తొమ్మిదిని గెలిచిన విషయం తెలిసిందే, మిగిలినవి ఆమ్ ఆద్మీ పార్టీ సాధించింది.
వివరాలు
బీజేపీ 50.47 శాతం ఓట్లు
2022లో 250 వార్డులకు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ 50.47 శాతం ఓట్లను పొందినప్పటికీ, ఈసారి 38.51 శాతానికి పరిమితం అయ్యింది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది,ఆమ్ ఆద్మీ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. ఈ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా వంటి అగ్ర నాయకులు పరాజయం చెందారు. ఇక ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా బాధ్యతలు చేపట్టారు.