LOADING...
Bomb Threat: దిల్లీలోని రెండు పాఠశాలలకు బాంబు బెదిరింపులు..  
దిల్లీలోని రెండు పాఠశాలలకు బాంబు బెదిరింపులు..

Bomb Threat: దిల్లీలోని రెండు పాఠశాలలకు బాంబు బెదిరింపులు..  

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 16, 2025
09:51 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధాని దిల్లీలోని రెండు పాఠశాలలకు బాంబు బెదిరింపులు అందాయి. ద్వారకాలో ఉన్న సెయింట్ థామస్ స్కూల్, వసంత్ వ్యాలీ స్కూల్‌లలో బాంబులు ఉంచినట్టు గుర్తు తెలియని వ్యక్తులు ఈమెయిల్ ద్వారా హెచ్చరికలు పంపారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే సెయింట్ థామస్, వసంత్ వ్యాలీ పాఠశాలల వద్దకు చేరుకున్నారు. రెండు పాఠశాలల‌ను పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకున్నారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌ల సహాయంతో ప్రతీ కోణాన్ని జాగ్రత్తగా తనిఖీ చేశారు. అయితే ఎలాంటి పేలుడు పదార్థాలు ఏ మాత్రం లభించలేదు. ఈ పరిస్థితితో పాఠశాల యాజమాన్యాలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద ఊపిరి పీల్చుకున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ద్వారకాలో ఉన్న సెయింట్ థామస్ స్కూల్