LOADING...
Delhi Pollution: దీపావళి వేళ దేశ రాజధాని ఢిల్లీలో మరింత దిగజారిన వాయునాణ్యత.. అమల్లోకి ఆంక్షలు
అమల్లోకి ఆంక్షలు

Delhi Pollution: దీపావళి వేళ దేశ రాజధాని ఢిల్లీలో మరింత దిగజారిన వాయునాణ్యత.. అమల్లోకి ఆంక్షలు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 20, 2025
11:43 am

ఈ వార్తాకథనం ఏంటి

దీపావళి వేళ దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయిని చేరింది. వాయు నాణ్యత సూచిక (AQI) అనేక ప్రాంతాల్లో 300కు మించిపోయింది. పటాకుల మోతతో సోమవారం ఉదయం 8 గంటలకు AQI 335గా నమోదైంది. 'వెరీ పూర్‌' కేటగిరీలోకి చేరిన నేపథ్యంతో, నగరం,చుట్టుపక్కల ప్రాంతాలలో సెంట్రల్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (CAQM) GRAP-2 (గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్-2) నిబంధనలను అమలు చేశారు. ప్రత్యేకంగా, ఆనంద్ విహార్‌లో AQI 414, వాజీపూర్‌లో 407గా నమోదవడంతో ఈ ప్రాంతాలు 'సేవర్' కేటగిరీలోకి చేరాయి.

వివరాలు 

జీఆర్‌ఏపీ-1 అమల్లోకి వచ్చిన ఆరు రోజుల్లోనే తాజా ఆంక్షలు

వాయు కాలుష్యం రాబోయే రోజుల్లో మరింత తీవ్రమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచి అధికారులు అప్రమత్తమయ్యారు. నిర్మాణ పనులపై ఆంక్షలు విధించారు. డీజిల్ జనరేటర్లు, కట్టెల పొయ్యిపై నిషేధాలు విధించారు. అలాగే, దుమ్మును తగ్గించడానికి కొన్ని ముఖ్య రోడ్లను రోజూ ఊడ్చడం, నీళ్లు చల్లడం వంటి చర్యలు చేపడతారు. వెంటనే ప్రజారవాణా ప్రోత్సాహం కోసం, వ్యక్తిగత వాహనాల వాడకాన్ని తగ్గించేందుకు, సిటీ బస్సులు, CNG, ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య పెంచడం, మెట్రో సర్వీసుల ఫ్రీక్వెన్సీని పెంచడం వంటి చర్యలు తీసుకుంటారు. GRAP-1 అమలు అయిన ఆరు రోజులలోనే కొత్త ఆంక్షలు విధించడం గమనార్హం.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఢిల్లీలో మరింత దిగజారిన వాయునాణ్యత..