Loading...
Delimitation: డీలిమిటేషన్‌తో మారనున్న లోక్‌సభ ముఖచిత్రం.. రాష్ట్రాల వారీగా సీట్ల వివరాలు!
డీలిమిటేషన్‌తో మారనున్న లోక్‌సభ ముఖచిత్రం

Delimitation: డీలిమిటేషన్‌తో మారనున్న లోక్‌సభ ముఖచిత్రం.. రాష్ట్రాల వారీగా సీట్ల వివరాలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 28, 2026
05:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంలో నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రస్తుత జనగణనతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలను 50 శాతం పెంచాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన బిల్లును నవంబర్ 30న లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాల సంఖ్య 816కు చేరనుంది. అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే నిష్పత్తిలో సీట్ల సంఖ్య పెరగనుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

వివరాలు

ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు పెరుగుతాయంటే?

ప్రతిపాదిత డీలిమిటేషన్ బిల్లు ప్రకారం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో లోక్‌సభ స్థానాల సంఖ్య ఎంత పెరగనుందనే వివరాలను పార్లమెంటరీ వ్యవహారాలు, న్యాయ శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ వెల్లడించారు.

ప్రస్తుతం ఉన్న సీట్ల సంఖ్య, పెంపు తర్వాత ఉండే స్థానాల వివరాలతో కూడిన చిత్రాన్ని ఆయన సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.

ADVERTISEMENT