ఇకపై భోజనానికి ఒంటరిగా వెళ్లం.. కలిసికట్టుగానే వెళ్తాం : మహిళా రెజ్లర్లు
ఈ వార్తాకథనం ఏంటి
లైంగిక వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా రెండు ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి. ఐపీసీ సెక్షన్లు 354, 34, ఫోక్సో చట్టంలోని సెక్షన్ 10 ప్రకారం లైంగిక వేధింపులపై పలు కేసులను రిజిస్టర్ చేశారు దిల్లీ పోలీసులు.
మరోవైపు ఇకపై తాము ఒంటరిగా భోజనానికి వెళ్లకూడదని సమిష్టిగా నిర్ణయించినట్లు మహిళా రెజ్లర్లు తెలిపారు.
బ్రిజ్ భూషణ్, ఫెడరేషన్ అధ్యక్షుడి హోదాలో రెజ్లర్లకు వృత్తిపరంగా సహకరించేందుకు లైంగికంగా తనకు లోబడి ఉండాలని కోరినట్లు రెజ్లర్లు ఆరోపిస్తున్నారు. అయితే మొత్తం 15 సార్లు లైంగికంగా వేధింపులకు గురిచేశారని రిపోర్టులో పేర్కొన్నారు.
ఇందులో కనీసం 10 సార్లు అనుచితంగా తాకడం, లైంగిక వేధింపులు, రొమ్ములపై చేతులు వేయడం, నాభిని తాకడం, బెదిరింపులు లాంటి కీలక నేరారోపణలున్నాయి.
భారత రెజర్ల మానసిక ఆందోళన
మా అమ్మాయిని ఇంకా పీడకలలు వెంటాడుతున్నాయి : తల్లిదండ్రులు
దీని ఆధారంగానే రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్, భాజపా ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్‌పై ఏప్రిల్ 28న దిల్లీ పోలీసులు రెండు కీలకమైన ఎఫ్‌ఐఆర్‌లు రిజిస్టర్ చేయడం గమనార్హం.
తాజాగా బాధితుల్లో ఒకరైన మైనర్ రెజ్లర్ తరఫున ఆమె తండ్రి దాఖలు చేసిన పిటిషన్ లో తన కుమార్తె పూర్తిగా కలవరపడిందని, మునుపటిలాగా ప్రశాంతంగా ఉండలేకపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
నిందితుడి లైంగిక వేధింపులు ఆమెను పీడకలల్లాగా వెంటాడుతూనే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
మొదటి ఎఫ్‌ఐఆర్‌లో ఆరుగురు మల్లయోధులు ఆరోపణలు చేయగా, అందులో ఫెడరేషన్ కార్యదర్శి వినోద్ తోమర్ పేరు ఉంది. రెండో ఎఫ్‌ఐఆర్ లో మైనర్ తండ్రి ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టంలోని సెక్షన్ 10ని ఇది ప్రతిబింబిస్తుంది.