Akbaruddin Owaisi: హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలు కూల్చివేత.. కీలక వ్యాఖ్యలు చేసిన అక్బరుద్దీన్ ఒవైసీ
హైదరాబాద్‌లో హైడ్రా చేపట్టిన అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ స్పందించారు. సలకం చెరువులో తన అకడమిక్ ఇన్‌స్టిట్యూట్‌ను కూల్చవద్దని, ట్యాంక్ బండ్ బఫర్ జోన్‌లో నెక్లెస్ రోడ్‌ను కూడా కూల్చివేస్తారా అని ఆయన ప్రశ్నించారు. తనపై మళ్లీ కాల్పులు జరగవచ్చని, కానీ తన స్కూల్‌ని మాత్రం కూల్చకూడదని అక్బరుద్దీన్ ఒవైసీ తెలిపారు. పేదలకు ఉచిత విద్య అందించాలనే ఉద్దేశంతో 12 భవనాలను నిర్మించానని, కొంతమంది ఉద్దేశపూర్వకంగా వాటిని తప్పుగా చూపిస్తున్నారని ఆయన ఆరోపించారు.
నాపై కాల్పులు జరగొచ్చు : అక్బరుద్దీన్ ఒవైసీ
అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ, తనపై గతంలో కాల్పులు జరిగాయని, మరల దాడులు జరిగితే కూడా తనను అడ్డుకోవడానికి ఎవరూ ప్రయత్నించవద్దని హెచ్చరించారు. పేదల విద్యాభివృద్ధికి జరుగుతున్న కృషిని అడ్డుకోవద్దన్నారు. కత్తులతో కూడా దాడి చేసుకోవచ్చని, కానీ పేదల విద్యకు అడ్డుపడొద్దని చెప్పారు. ఇదిలా ఉంటే, హైదరాబాద్‌లో హైడ్రా చేపట్టిన అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా విమర్శలు గుప్పించారు.