LOADING...
Noida: దట్టమైన పొగమంచు ప్రభావం.. నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై పదుల సంఖ్యలో వాహనాలు ఢీ
దట్టమైన పొగమంచు ప్రభావం.. నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై పదుల సంఖ్యలో వాహనాలు ఢీ

Noida: దట్టమైన పొగమంచు ప్రభావం.. నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై పదుల సంఖ్యలో వాహనాలు ఢీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 13, 2025
01:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర భారతంలో వాయు కాలుష్యం (Air Pollution) తీవ్రత కొనసాగుతోంది. గాలి నాణ్యత సూచీ (AQI) ప్రమాదకర స్థాయికి చేరుకుంటుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారుజామున నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై దట్టమైన పొగమంచు (Dense Fog) కమ్ముకోవడంతో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా దృశ్యమానత తగ్గిపోవడంతో పదుల సంఖ్యలో వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి (Multiple Vehicles Collide on Noida Expressway). ఈ ప్రమాదంలో పలువురు వాహనదారులకు గాయాలు కావడంతో, క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదం కారణంగా హైవేపై వాహనాలు భారీగా నిలిచిపోవడంతో, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు వెంటనే చర్యలు చేపట్టారు. ప్రమాద స్థలానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Details

కాలుష్య సమస్య మరింత తీవ్రతరం

ఇదిలా ఉండగా, దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్య సమస్య మరింత ప్రమాదకర స్థాయికి చేరింది. గాలిలో కాలుష్య కారక సూక్ష్మ ధూళికణాలైన PM2.5 స్థాయులు భారీగా పెరిగినట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) వెల్లడించింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో, దిల్లీ అంతటా కాలుష్య నియంత్రణ చర్యలను మరింత కఠినతరం చేస్తున్నట్లు వాయునాణ్యత నిర్వహణ కమిషన్ (CAQM) ప్రకటించింది. గాలి నాణ్యత సూచీ (AQI) ప్రమాదకర స్థాయికి క్షీణిస్తుండటంతో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్-III (GRAP-III)ను అమల్లోకి తీసుకొస్తున్నట్లు స్పష్టం చేసింది.

Details

ఈ చర్యలలో భాగంగా అమలు చేసే ప్రధాన ఆంక్షలు ఇవే

అనవసరమైన అన్ని నిర్మాణాలు, కూల్చివేత కార్యకలాపాలపై పూర్తిస్థాయి నిషేధం. దిల్లీ, గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్, నోయిడా తదితర ప్రాంతాల్లో అత్యవసర వస్తువులు రవాణా చేసే వాహనాలు మినహా, దిల్లీ వెలుపల రిజిస్టర్ అయిన అన్ని పెట్రోల్ మరియు డీజిల్ వాహనాలపై నిషేధం. రైల్వేలు, మెట్రో, విమానాశ్రయాలు, రక్షణ రంగాలకు సంబంధించిన నిర్మాణ పనులు మినహా, మిగతా అన్ని నిర్మాణ కార్యకలాపాలపై నిషేధం. మొత్తంగా ఉత్తర భారతంతో పాటు దిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వీడియో

Advertisement