Loading...
Depression: వాయవ్య బంగాళాఖాతంలో వాయుగుండం.. 24 గంటల్లో తీవ్ర రూపం దాల్చే అవకాశం
వాయవ్య బంగాళాఖాతంలో వాయుగుండం.. 24 గంటల్లో తీవ్ర రూపం దాల్చే అవకాశం

Depression: వాయవ్య బంగాళాఖాతంలో వాయుగుండం.. 24 గంటల్లో తీవ్ర రూపం దాల్చే అవకాశం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 26, 2026
04:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

వాయవ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడినట్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రానున్న 24 గంటల్లో ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఏర్పడిన వాయుగుండం సోమవారం ఒడిశాలోని పారాదీప్‌-సాగర్‌ ద్వీపాల మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని సంస్థ పేర్కొంది. దీని ప్రభావం ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలపై కూడా కనిపించే అవకాశముందని హెచ్చరించింది.

వివరాలు 

గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు

వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

అలాగే సముద్రం అలజడిగా మారే అవకాశం ఉన్నందున తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

అదేవిధంగా ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టంగా హెచ్చరించింది.

ప్రజలు అధికారుల సూచనలను పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

ADVERTISEMENT