Loading...
Andhra Pradesh: తీవ్ర వాయుగుండం ప్రభావం.. నేడు ఏపీలో పలు జిల్లాలకు వర్ష సూచన
తీవ్ర వాయుగుండం ప్రభావం..నేడు ఏపీలో పలు జిల్లాలకు వర్ష సూచన

Andhra Pradesh: తీవ్ర వాయుగుండం ప్రభావం.. నేడు ఏపీలో పలు జిల్లాలకు వర్ష సూచన

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 30, 2026
09:08 am

ఈ వార్తాకథనం ఏంటి

ఛత్తీస్‌గఢ్‌ను ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా ప్రాంతంపై ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రస్తుతం కదులుతోందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఈ వ్యవస్థ రానున్న 24 గంటల్లో ఛత్తీస్‌గఢ్‌ మీదుగా మధ్యప్రదేశ్‌ వైపు ప్రయాణించే అవకాశముందని తెలిపింది. దీని ప్రభావంతో గురువారం ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. పోలవరం, తూర్పుగోదావరి, ఏలూరు, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, నెల్లూరు, శ్రీసత్యసాయి, వైఎస్సార్‌ కడప జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.

వివరాలు 

అమలాపురంలో అత్యధికంగా 72.4 మిల్లీమీటర్లు వర్షం

ఇదిలా ఉండగా, మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గణనీయమైన వర్షపాతం నమోదైంది.

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురంలో అత్యధికంగా 72.4 మిల్లీమీటర్లు వర్షం కురిసింది.

కృష్ణా జిల్లా కంకిపాడులో 67.2 మి.మీ., పెనమలూరులో 64.6 మి.మీ., పశ్చిమగోదావరి జిల్లా పోడూరులో 60.4 మి.మీ., ఏలూరు జిల్లా కలిదిండిలో 55.6 మి.మీ., పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో 52.6 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

ADVERTISEMENT