Dera Baba: డేరా బాబాకు మరోసారి పెరోల్.. రెండు నెలల తరువాత ఇంకోసారి .. జైల్లో కంటే బయటే ఎక్కువ..!
వివాదాస్పద గురు,డేరా సచ్చా సౌదా చీఫ్ రామ్ రహీమ్(డేరా బాబా)కు మరోసారి పెరోల్ మంజూరైంది. అతనికి 50 రోజుల పెరోల్ మంజూరు చేశారు.అంతకుముందు గుర్మీత్ సింగ్ 2023 నవంబర్‌లో 21 రోజుల పెరోల్‌పై జైలు నుంచి విడుదలయ్యాడు. గుర్మీత్ సింగ్ అనారోగ్యంతో ఉన్న తన తల్లిని పరామర్శించడానికి అనేకసార్లు పెరోల్‌పై జైలు నుండి విడుదలయ్యాడు. ఇద్దరు శిష్యులపై అత్యాచారం చేసినందుకు 2017లో అతనికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించారు. 2002లో జర్నలిస్టు రామ్ చందర్ ఛత్రపతి, డేరా మేనేజర్ రంజిత్ సింగ్ హత్యలతో సహా రెండు హత్య కేసుల్లో జైలు శిక్షను అనుభవిస్తున్నాడు.కు పాల్పడిన ఖైదీలు లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద పెరోల్‌కు అర్హులు కారు.
2019లో దోషిగా నిర్ధారణ
2021లో డేరా మేనేజర్ రంజిత్ సింగ్‌ను హత్య చేసేందుకు కుట్ర పన్నినందుకు రామ్ రహీమ్ దోషిగా నిర్ధారించబడ్డాడు. 16 ఏళ్ల క్రితం జర్నలిస్టును హత్య చేసిన కేసులో డేరా చీఫ్, మరో ముగ్గురు 2019లో దోషులుగా నిర్ధారించబడ్డారు. హర్యానా మంచి ప్రవర్తన ఖైదీల (తాత్కాలిక విడుదల) చట్టం, 2022 ప్రకారం, దోషులుగా తేలిన ఖైదీలకు సాధారణ పెరోల్ మంజూరు చేయవచ్చు. అయితే, అనేక హత్యలకు పాల్పడిన ఖైదీలు లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద పెరోల్‌కు అర్హులు కారు.