Delhi Air pollution: కేజ్రీవాల్ ఆధ్వర్యంలో వాయు కాలుష్య సంక్షోభంపై ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు
దిల్లీ నగరంలో తీవ్రమవుతున్న వాయు కాలుష్య సంక్షోభంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు మధ్యావాయు కాలుష్య సంక్షోభంపై 12:00 గంటలకు ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్, సంబంధిత శాఖల అధికారులు హాజరుకానున్నారు. గాలి నాణ్యత 'severe' కేటగిరీలో ఉన్నందున ఢిల్లీ దట్టమైన పొగమంచుతో కప్పబడి ఉందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) గణాంకాలు సోమవారం వెల్లడించాయి. దేశ రాజధానిలో 'తీవ్రమైన' గాలి నాణ్యత నమోదు కావడం ఇది వరుసగా నాలుగో రోజు.CPCB డేటా ప్రకారం,ఢిల్లీ మొత్తం గాలి నాణ్యత సూచిక (AQI)ఉదయం 9 గంటలకు 437 వద్ద నమోదైంది.