Delhi: దిల్లీలో క్షీణించిన గాలి నాణ్యత.. రోడెక్కి పెద్దఎత్తున నిరసనలు.. అరెస్టు!
ఈ వార్తాకథనం ఏంటి
దేశ రాజధాని దిల్లీని కాలుష్యం తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. స్వచ్ఛమైన గాలి లభించకపోవడంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కాలుష్య నియంత్రణకు మేఘమథనం వంటి ప్రయత్నాలు చేసినప్పటికీ, ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి. తాజాగా వాతావరణ పరిస్థితులు మరింత కష్టతరమయ్యాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో వందలాది నగరవాసులు రోడ్డెక్కి 'ఇండియా గేట్' దగ్గర నిరసనకు దిగారు. తక్షణ పరిష్కారం కోరుతూ డిమాండ్ వ్యక్తం చేశారు.
Details
ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
అయితే, నిరసనకారులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతలేర్పడ్డాయి. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం దిల్లీలో గాలి నాణ్యత స్థాయి గణనీయంగా పడిపోయి, 'AQI 400 కంటే ఎక్కువగా నమోదైంది. ప్రజలు గాలి పీల్చుకోవడం కూడా కష్టపడుతున్నారు. ఈ నేపథ్యంపై ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ నాయకులు కలిసి కార్యకర్తలు, నిరసనకారులను ఇండియా గేట్ వైపు కవాతు చేయించి, వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రభుత్వం సమర్థవంతమైన విధానాలు రూపొందించాలని డిమాండ్ చేశారు.