Page Loader
Deve Gowda: ప్రజ్వల్ రేవణ్ణ దోషిగా తేలితే శిక్షించండి: హెచ్‌డీ దేవెగౌడ
ప్రజ్వల్ రేవణ్ణ దోషిగా తేలితే శిక్షించండి: హెచ్‌డీ దేవెగౌడ

Deve Gowda: ప్రజ్వల్ రేవణ్ణ దోషిగా తేలితే శిక్షించండి: హెచ్‌డీ దేవెగౌడ

వ్రాసిన వారు Stalin
May 18, 2024
05:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై ఆ పార్టీ అధినేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ మౌనం వీడారు. దోషిగా తేలితే తన మనవడిపై చర్యలు తీసుకోవడానికి అభ్యంతరం లేదని అన్నారు. తన కుమారుడు, జెడి(ఎస్) ఎమ్మెల్యే హెచ్‌డి రేవణ్ణపై లైంగిక వేధింపులు, మహిళ కిడ్నాప్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులు కూడా 'కల్పితం' అని తెలిపారు. రేపటి తీర్పుపై తాను వ్యాఖ్యానించదలచుకోలేదు' అని దేవెగౌడ పేర్కొన్నారు.

Details 

ప్రజ్వల్‌ తో మాటా మంతీలేదు 

ప్రజ్వల్ రేవణ్ణ విదేశాలకు వెళ్లారని, ఈ విషయంలో కుమారస్వామి (గౌడ రెండో కుమారుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి) మా కుటుంబం తరపున మాట్లాడుతూ దేశంలోని చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. ఇందులో చాలా మంది ప్రమేయం ఉంది (లైంగిక దోపిడీ కేసు), నేను ఎవరి పేరునూ తీసుకోదలచుకోలేదు. ఈ కేసులో ప్రమేయమున్న వారందరిపైనా చర్యలు తీసుకోవాలని, బాధిత మహిళలకు న్యాయం చేయాలని, వారికి పరిహారం అందజేయాలని కుమారస్వామి కోరారు. ఇదిలా ఉంటే.. ప్రజ్వల్‌తో తనకు ఎలాంటి కాంటాక్ట్ లేదని కుమారస్వామి చెప్పారు. కర్ణాటకలో ఉన్న సమయంలో కూడా టచ్‌లో లేనన్నారు. అతడి వెంట పరిగెత్తాలా ఏంటి..? అని ప్రశ్నించారు.

Details 

డికె గుట్టును రట్టు చేస్తా: దేవ రాజే గౌడ

ప్రజ్వల్‌ వీడియో టేపుల వ్యవహరంలో సహకరిస్తే కర్ణాటక డిప్యూటీ సిఎం డికే శివకుమార్ వంద కోట్లు ఇస్తానని తనకు ఆఫర్ చేసినట్లు దేవ రాజే గౌడ ఇవాళ మీడియాకు చెప్పి సంచలనం సృష్టించారు. దీంతో మొత్తం కర్ణాటకలో కలకలం రేగింది. జైలు నుంచి బయటికి వచ్చాక డికె గుట్టును రట్టు చేస్తానని బిజెపి నేత దేవ రాజే గౌడ హెచ్చరించారు. కర్ణాటక సర్కార్ మనుగడ కష్టమేనన్నారు. ప్రజ్వల్‌ వీడియో టేపుల వ్యవహరంతో జెడి(ఎస్) ఇరుకున పడిన సంగతి తెలిసిందే. కర్ణాటకలో బిజెపి, జెడి(ఎస్) గత ఏడాది పొత్తు కుదుర్చుకుని బరిలోకి దిగాయి.