Cyclone: అరేబియా సముద్రంలో తుపాను.. 48 గంటల్లో అల్పపీడనం
ఆగ్నేయ అరేబియా సముద్రం, దానిని ఆనుకుని ఉన్న లక్షద్వీప్ ప్రాంతంలో ఏర్పడిన తుపాను వల్ల వచ్చే 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఒకవేళ అల్పపీడనం ఏర్పడితే, రుతుపవనాల తర్వాత ఏర్పడే తొలి తుఫాను ఇదే అవుతుంది. లక్షద్వీప్ ప్రాంతం, ఆగ్నేయ అరేబియా సముద్రం, కేరళ తీరం గుండా వాయుగుండం ఏర్పడి.. అది పశ్చిమ-వాయువ్య-పశ్చిమ దిశగా కదిలే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో ఆగ్నేయ, తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడొచ్చని చెప్పింది. అక్టోబర్ 21 నాటికి అల్పపీడనంగా మారొచ్చని, అయితే తుపాను తీవ్రతను ఇంకా నిర్దారించలేదని అధికారులు వెల్లడించారు. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఐఎండీ తెలిపింది.