LOADING...
DGCA: విమాన సిబ్బంది విధుల్లో ఆపరేటర్లకు ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకున్న డిజిసిఎ 
విమాన సిబ్బంది విధుల్లో ఆపరేటర్లకు ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకున్న డిజిసిఎ

DGCA: విమాన సిబ్బంది విధుల్లో ఆపరేటర్లకు ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకున్న డిజిసిఎ 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 05, 2025
01:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

హమ్మయ్య.. ఎట్టకేలకు ప్రయాణికులకు ఊరట కలిగించే శుభవార్త వచ్చింది. వరుసగా మూడు రోజులపాటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికుల సమస్యలకు డీజీసీఏ చెక్ పెట్టింది. నవంబర్‌ 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త కఠిన నియమాలను వారం రోజులపాటు నిలిపివేసింది. దీంతో ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ఎదుర్కొంటున్న సంక్షోభానికి తాత్కాలికంగా ముగింపు పలికినట్లైంది. నవంబర్‌ 1 నుంచి కొత్త డ్యూటీ టైమ్ నిబంధనలు అమల్లోకి రావడంతో, ఇండిగోలో పైలట్లు, క్యాబిన్‌ సిబ్బంది కొరత తీవ్రంగా నెలకొంది. పైలట్లకు తప్పనిసరిగా నిర్ధేశించిన విశ్రాంతి నిబంధనలు అమలులోకి రావడంతో, విమాన సంస్థ కార్యకలాపాలు పూర్తిగా గందరగోళానికి గురయ్యాయి.

వివరాలు 

డీజీసీఏ, వారం రోజులపాటు కొత్త నిబంధనలను నిలిపివేయాలని తాజా నిర్ణయం

తాజా నిబంధనల ప్రకారం డ్యూటీ షెడ్యూళ్లు, నైట్ ల్యాండింగ్ ప్లాన్లు, వారపు విశ్రాంతి చార్టులలో మార్పులు చేయాల్సి వచ్చింది. ఇది ఇండిగో ఎయిర్‌లైన్ షెడ్యూలింగ్ వ్యవస్థను పూర్తిగా దెబ్బతీసింది.నూతన నిబంధనలకు అనుగుణంగా సిబ్బంది లోటును వెంటనే భర్తీ చేయలేకపోతున్నట్లు ఇండిగో ప్రకటించాల్సి వచ్చింది. ఈ పరిస్థుతుల్లో గురువారం డీజీసీఏ అధికారులను కలిసిన ఇండిగో ప్రతినిధులు - ఆంక్షలను తాత్కాలికంగా ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. దానికి స్పందించిన డీజీసీఏ, వారం రోజులపాటు కొత్త నిబంధనలను నిలిపివేయాలని తాజా నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో విమాన సర్వీసులు మళ్లీ సాధారణ స్థితికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూడు రోజులుగా ఎయిర్‌పోర్టుల్లోనే ఆహారం, వసతి లేక ఇబ్బందులు పడుతున్న ప్రయాణికుల కష్టాలు ఇకపై తొలగే సూచనలు చెబుతున్నాయి.

Advertisement