LOADING...
Kanakadurgamma: ఇంద్రకీలాద్రికి అమ్మవారికి 'ధనకొండ' పుట్టిల్లు
ఇంద్రకీలాద్రికి అమ్మవారికి 'ధనకొండ' పుట్టిల్లు

Kanakadurgamma: ఇంద్రకీలాద్రికి అమ్మవారికి 'ధనకొండ' పుట్టిల్లు

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 23, 2025
11:24 am

ఈ వార్తాకథనం ఏంటి

బెజవాడ పేరు వింటే అందరికి గుర్తుకు వచ్చేది ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన కనకదుర్గమ్మ. ప్రాచీన విశ్వాసాల ప్రకారం, జగన్మాత దుర్గమ్మ మొట్టమొదట మొగల్రాజపురంలో పాదం మోసి, అక్కడి నుంచి ఇంద్రకీలాద్రికి చేరినట్లుగా నమ్మకాలు ఉన్నాయి. భక్తుల చెప్పుకోవడం ప్రకారం, దుర్గమ్మ ఇంద్రకీలాద్రిపై కొలువు తీరడానికి ముందుగా దక్షిణాభిముఖంగా, విజయవాడలోని మొగల్రాజపురం (ధనకొండ) కొండపై ఒక చిన్న గుహలో శ్రీ చక్రపీఠం, పాదాలు, నేత్రాల రూపంలో కొలువుదీరినట్లు విశ్వాసం ఉంది.

Details

ఆలయంలో అమ్మవారి పాదముద్రలు 

దసరా ఉత్సవాల్లో, ప్రతి రాత్రివేళ దుర్గమ్మ ఇంద్రకీలాద్రి నుంచి మొగల్రాజపురంలోని ధనకొండ ఆలయానికి చేరతారని భక్తులు విశ్వసిస్తారు. ఆలయంలో అమ్మవారి పాదముద్రలు కూడా ఉన్నాయని ప్రసిద్ధి. అలాగే, అమ్మవారి గర్భగుడి పై గోపురం ఉన్న ప్రాంతంలో, కొండలో అంతర్భాగంగా శివలింగంను కూడా ఏర్పాటు చేశారు. దసరా నవరాత్రుల్లో ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న భక్తులు, మోగల్రాజపురంలోని ధనకొండ అమ్మవారిని కూడా దర్శించడం ఒక సంప్రదాయం.