Loading...
Dharmendra Pradhan Resign: నీట్ వివాదం తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. ప్రతిపక్షాల తొలి రియాక్షన్ ఇదే!
నీట్ వివాదం తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. ప్రతిపక్షాల తొలి రియాక్షన్ ఇదే!

Dharmendra Pradhan Resign: నీట్ వివాదం తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. ప్రతిపక్షాల తొలి రియాక్షన్ ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 25, 2026
03:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. విద్యార్థుల భవిష్యత్తు ఎలాంటి రాజకీయ లేదా న్యాయపరమైన వివాదాల్లో చిక్కుకోకుండా ఉండాలని, దేశ విద్రోహ శక్తులకు ఈ అంశాన్ని ఉపయోగించుకునే అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం ప్రతిపక్ష పార్టీలు, నేతలు స్పందిస్తూ దీనిని విద్యార్థుల విజయంగా అభివర్ణించాయి. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)తన అధికారిక ఎక్స్ ఖాతాలో స్పందిస్తూ.. యువత విజయం. అహంకారియైన ప్రధానమంత్రి, ప్రభుత్వం తలవంచక తప్పలేదని పేర్కొంది. దేశవ్యాప్తంగా విద్యార్థులు చేపట్టిన నిరసనలు, పెరుగుతున్న ప్రజా ఒత్తిడి కారణంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆ పార్టీ వ్యాఖ్యానించింది.

వివరాలు

ప్రజాస్వామ్యంలో అతిపెద్ద విజయం

మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను స్వాగతించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా వార్త ఇప్పుడే తెలిసింది.

ఈ నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నాను. దీని వల్ల ప్రస్తుత ఉద్రిక్తత తగ్గి, పార్లమెంట్‌లోనూ, పార్లమెంట్ వెలుపలనూ దేశ విద్యా వ్యవస్థకు సంబంధించిన కీలక అంశాలపై గంభీరమైన చర్చ జరిగే అవకాశం ఏర్పడుతుందని ఆశిస్తున్నానని ఎక్స్‌లో పేర్కొన్నారు.

ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రజాస్వామ్యానికి అతిపెద్ద విజయమని అన్నారు.

ఎన్సీపీ(శరద్ పవార్ వర్గం)నేత సుప్రియా సూలే నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులు, నిరసనకారులకు శుభాకాంక్షలు తెలిపారు.

కాంగ్రెస్ సీనియర్ నేత భూపేష్ బాఘెల్ కూడా ఈ పరిణామాన్ని 'యువత విజయం'గా అభివర్ణించారు.

ADVERTISEMENT