Page Loader
Dheeraj Sahu IT raids: కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు ఇంట్లో నల్లధనం కొండ.. నాలుగు రోజులైనా తేలని లెక్క 
Dheeraj Sahu IT raids: కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు ఇంట్లో నల్లధనం కొండ.. నాలుగు రోజులైనా తేలని లెక్క

Dheeraj Sahu IT raids: కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు ఇంట్లో నల్లధనం కొండ.. నాలుగు రోజులైనా తేలని లెక్క 

వ్రాసిన వారు Stalin
Dec 10, 2023
11:47 am

ఈ వార్తాకథనం ఏంటి

ఒడిశా, జార్ఖండ్‌లోని కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహుకు చెందిన స్థావరాల్లో ఆదాయపు పన్ను శాఖ దాడులు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నారు. ఎంపీ ధీరజ్ సాహు స్థావరాల్లో నల్ల ధనం లెక్కింపు నాలుగు రోజులైనా పూర్తికాకపోవడం గమనార్హం. ఇప్పటివరకు రూ.300కోట్ల నల్లధనాన్ని ఐటీ అధికారులు గుర్తించారు. దాదాపు 100మంది అధికారులు 40మెషీన్లతో నాలుగు రోజులుగా లెక్కిస్తున్నారు. అయినా నోట్ల కట్టలు లెక్కించడం పూర్తికాకపోవడం గమనార్హం. నల్లధనం మొత్తం రూ.350 కోట్లకు మించి ఉంటుందని ఆదాయపు పన్ను శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అధికారులు స్వాధీనం చేసుకున్న వెంట, వెంటనే ఒడిశాలోని ప్రభుత్వ బ్యాంకు శాఖల్లో డిపాజిట్ చేస్తున్నారు. ఏ ఏజెన్సీ అయినా ఒకే ఆపరేషన్‌లో ఇంత మొత్తంలో నల్లధనాన్ని పట్టుకోవడం ఇదే తొలిసారి.

ఒడిశా

నగదును లెక్కించడానికి రంగంలోకి అదనపు యంత్రాలు, ఉద్యోగులు 

ఒడిశా, జార్ఖండ్‌లోని ధీరజ్ సాహు రహస్య స్థావరాల్లో ఐటీ నోట్ల లెక్కింపును ఆదివారంతో ముగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం మరిన్ని నోట్ల లెక్కింపు యంత్రాలను, ఉద్యోగులను పిలిపించారు. బోలంగీర్ జిల్లాలోని ఎస్‌బీఐ ప్రాంతీయ మేనేజర్ భగత్ బెహెరా మాట్లాడుతూ.. రాజ్యసభ ఎంపి ధీరజ్ సాహు ప్రాంగణంలో స్వాధీనం చేసుకున్న నగదును లెక్కించడానికి యంత్రాలు, ఉద్యోగులను పెంచామన్నారు. ధీరజ్ సాహు స్థావరాల్లో రికవరీ చేసిన 176బస్తాల్లో దాదాపు 40బస్తాలను లెక్కించామన్నారు. కాగా, ధీరజ్ సాహు నల్లధనం వ్యవహారంపై కాంగ్రెస్ స్పందించింది. ధీరజ్ వ్యాపారంతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. నల్లధనం వ్యవహారంపై వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ ట్వీట్ చేశారు.