Page Loader
హైదరాబాద్- ఫ్రాంక్‌ఫర్ట్‌కు నేరుగా విమాన సర్వీసు; వచ్చే ఏడాది నుంచి ప్రారంభం 
హైదరాబాద్- ఫ్రాంక్‌ఫర్ట్‌కు నేరుగా విమాన సర్వీసు; వచ్చే ఏడాది నుంచి ప్రారంభం

హైదరాబాద్- ఫ్రాంక్‌ఫర్ట్‌కు నేరుగా విమాన సర్వీసు; వచ్చే ఏడాది నుంచి ప్రారంభం 

వ్రాసిన వారు Stalin
May 25, 2023
05:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిపోర్టు నుంచి విదేశాలకు నేరుగా విమాన సర్వీసులు నడుస్తున్న విషయం తెలిసింది. అయితే తాజాగా జీఎంఆర్ నేతృత్వంలోని హైదరాబాద్ విమానాశ్రయం భాగ్యనగరం నుంచి డైరెక్ట్‌గా జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ పట్టణంలోని ఎయిర్ పోర్టు సర్వీసును నడిపేందుకు సిద్ధమైంది. ఇందుకోసం హైదరాబాద్ విమానాశ్రయం యూరోపియన్ ఎయిర్‌లైన్ లుఫ్తాన్సాతో సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. హైదరాబాద్- ఫ్రాంక్‌ఫర్ట్‌కు లుఫ్తాన్సా ద్వారా నాన్‌స్టాప్ సర్వీస్‌ను నడపనున్నారు.

జర్మనీ

జనవరి 16, 2024న తొలి సర్వీసు ప్రారంభం

ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి హైదరాబాద్‌కు లుఫ్తాన్సా ఎయిర్ లైన్ ఆధ్వర్యంలో తొలి నాన్‌స్టాప్ విమాన సర్వీస్‌ను జనవరి 16, 2024న ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విమానం మధ్యలో ఎక్కడా ఆగదు కాబట్టి, ప్రయాణికుల కోసం విశాలంగా ఉండేందుకు బోయింగ్ B787-9 విమానాన్ని ఫ్రాంక్‌ఫర్ట్ -హైదరాబాద్‌ మధ్య నడపనున్నారు. ఈ విమానంలో 26 బిజినెస్ క్లాస్, 21 ప్రీమియం ఎకానమీ, 247 ఎకానమీ క్లాస్ సీట్లు ఉంటాయి. తొలి రోజున విమానం ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి ఉదయం 10 గంటలకు (ఎల్‌టి) బయలుదేరి రాత్రి 11 గంటలకు (ఎల్‌టి) హైదరాబాద్ చేరుకుంటుంది. అయితే ఈ విమాన సర్వీసును వారానికి మూడు రోజులే నడపనున్నారు. మంగళవారం, శుక్రవారం, ఆదివారం మాత్రమే ఈ సర్వీసును నడపాలని నిర్ణయించారు.