Loading...
Aam Aadmi Party: పంజాబ్ ఆప్‌లో అసంతృప్తి సెగ.. పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేల గుడ్‌బై!
పంజాబ్ ఆప్‌లో అసంతృప్తి సెగ.. పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేల గుడ్‌బై!

Aam Aadmi Party: పంజాబ్ ఆప్‌లో అసంతృప్తి సెగ.. పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేల గుడ్‌బై!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 01, 2026
03:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

పంజాబ్‌లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కు ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల పార్టీ ప్రకటించిన తొలి అభ్యర్థుల జాబితాలో టికెట్ దక్కకపోవడంతో ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేశారు. సనౌర్ నియోజకవర్గ ఎమ్మెల్యే హర్మీత్ సింగ్ పఠాన్‌మజ్రా, సమానా ఎమ్మెల్యే చేతన్ సింగ్ జౌరామజ్రా ఆమ్ ఆద్మీ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఈ పరిణామం పంజాబ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

వివరాలు

కేజ్రీవాల్‌కు రాజీనామా లేఖ

సనౌర్ ఎమ్మెల్యే హర్మీత్ సింగ్ పఠాన్‌మజ్రా తన రాజీనామా లేఖను ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు పంపించారు.

మరోవైపు సమానా ఎమ్మెల్యే చేతన్ సింగ్ జౌరామజ్రా సోషల్ మీడియా పోస్టు ద్వారా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.

తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని పంజాబ్ ఆప్ అధ్యక్షుడు అమన్ అరోరాను కోరారు.

వివరాలు

పార్టీ నాయకత్వంతో విభేదాలు

పార్టీ నాయకత్వంలో నెలకొన్న విభేదాల నేపథ్యంలో ఈ ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామాలు చోటుచేసుకున్నాయి.

గతంలో హర్మీత్ సింగ్ పఠాన్‌మజ్రాపై ఆయన సొంత ప్రభుత్వమే చర్యలు ప్రారంభించింది. ఈ పరిణామంతో పార్టీ నాయకత్వంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

అప్పటి నుంచి పార్టీ నాయకత్వంతో ఘర్షణాత్మక వైఖరిని అవలంభిస్తున్నారు. తాజాగా తొలి అభ్యర్థుల జాబితాలో టికెట్ నిరాకరించడంతో ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు.

దీంతో పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీకి రాజకీయంగా మరో ఎదురుదెబ్బ తగిలినట్లయింది.

ADVERTISEMENT